తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని డిజిపిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పోలీసులపై చర్యలకు సంబందించిన రిపోర్టు స్పీకర్ ముందు ఉంచాలని డిజిపికి ఆదేశించింది. స్పీకర్ ఆదేశాలతో పోలీసులు వ్యవహరించి ఉంటే అది స్పీకర్ అధికార పరిధిలోకి వస్తుందన్న తెలంగాణ హైకోర్టు వివరించింది.
శాసనసభ ప్రాంగణంలో జరిగిన ఘటనకు సంబంధించి ఎవరి ఆదేశాల మేరకు పోలీసులు వ్యవహరించారు? ఏ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలతో వాగ్వాదం లేదా తోపులాట చోటుచేసుకుంది? అనే అంశాలపై కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారని మహిళా ఎమ్మెల్యేలు ఆరోపించారు.
మరోవైపు, శాంతిభద్రతలు, సభా కార్యక్రమాల నిర్వహణలో భాగంగానే పోలీసులు విధులు నిర్వర్తించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఘటనకు సంబంధించిన పోలీసుల పాత్ర, వారికి వచ్చిన ఆదేశాలు, తీసుకున్న చర్యలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డీజీపీ సమర్పించే నివేదిక, అనంతరం స్పీకర్ పరిధిలో జరిగే చర్యలే ఈ వ్యవహారంలో తదుపరి కీలక పరిణామాలుగా మారనున్నాయి.
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎన్నికైన ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడానికి వారికి ఏ అధికారం ఉందని న్యాయస్థానం ప్రశ్నించింది. శాసనసభ సభ్యుల హక్కులు, సభా వ్యవహారాల్లో పోలీసుల జోక్యానికి సంబంధించిన అంశాలపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది

More Stories
శివుడు పేదల దేవుడు, రాముడు ధనికుల దేవుడు
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు ప్రారంభం
భట్టి ఛాంబర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్ల బకాయిల పోరు!