‘ఢీ’ ప్రోగ్రామ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బిజెపిలో చేరారు. తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షడు రామచందర్ రావు కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. శ్రష్టి వర్మతో పాటు మరికొంత మంది కూడా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. దేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులు ఏకమవుతున్న తరుణంలో యువత రాజకీయాల్లోకి రావడం, అందునా బిజెపిలో చేరడం హర్షణీయమని ఈ సందర్భంగా రామచందర్ రావు తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్ ఇటావాకు చెందిన శ్రష్టి ‘ఢీ’ షో ద్వారా వెలుగులోకి వచ్చి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీలోని ‘సూసేకి..’ పాటకు కొరియోగ్రఫీ చేసి సంచలనం సృష్టించారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 కంటెస్టెంట్‌గా అలరించిన శ్రష్టి వర్మ బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు.
కాగా, సమాజంలోని వివిధ వర్గాలు, వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది భారతీయ జనతా పార్టీలో చేరుతుందనటం పట్ల రామచందర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలు, నాయకత్వం పట్ల ప్రభావితమై మరింత మంది బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. దేశ ఐక్యత, జాతీయత, దేశ అభివృద్ధి కోసం ముందుకు వచ్చి బీజేపీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం తెలిపారు.

More Stories
ఈ సెషన్స్ మొత్తం బీఆర్ఎస్ ఎమ్యెల్యేల సస్పెన్షన్
ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ వీధి నాటకాలు
మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి తిరస్కరించిన శారద!