ఈ వీసా ఆన్ అరైవల్ సౌకర్యం పొందాలంటే భారతీయ పౌరుల సాధారణ పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ కలిగి ఉండాలి. దీంతోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ తదితర దేశాల నుంచి జారీచేసిన వ్యాలిడ్ వీసా, గ్రీన్ కార్డ్ లేదా రెసిడెన్స్ పర్మిట్ తప్పనిసరిగా ఉండాలి.
గతంలో ఈ సౌకర్యం కేవలం అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే 2025 ఫిబ్రవరి 13 నుంచి యూఏఈ ప్రభుత్వం ఈ జాబితాను విస్తరించింది. కొత్తగా ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల రెసిడెన్స్ పర్మిట్లు ఉన్న భారతీయులకు కూడా ఈ అర్హతను కల్పించింది.
యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ విస్తరణ యూఏఈలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద వర్తిస్తుంది. అయితే అర్హత ఉన్న ప్రయాణికులు తమవెంట కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న భారతీయ పాస్‌పోర్ట్, అనుమతి పొందిన దేశాల నుంచి జారీ చేయబడిన వ్యాలిడ్ వీసా, గ్రీన్ కార్డ్ లేదా రెసిడెన్స్ పర్మిట్. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే ఇతర సహాయక ప్రయాణ పత్రాలు తీసుకు రావాలి.
ప్రయాణికులు యూఏఈలోకి ప్రవేశించే తేదీ నాటికి తమ క్వాలిఫైయింగ్ వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ చెల్లుబాటులో ఉందని నిర్ధారించుకోవాలి. సాధారణంగా అర్హత కలిగిన భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు 14 రోజుల వీసా ఆన్ అరైవల్ మంజూరు చేస్తారు. అవసరమైతే వర్తించే ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, రుసుములకు లోబడి ఈ వీసాను మరో 14 రోజులపాటు ఒకసారి పొడిగించుకోవచ్చు.
వీసా కేటగిరీలు, సర్వీస్ ఫీజులు మారే అవకాశం ఉన్నందున ప్రయాణికులు బయలుదేరే ముందు యూఏఈ ఇమ్మిగ్రేషన్ అధికారులతో గానీ, తమ ఎయిర్‌లైన్‌తోగానీ తాజా నిబంధనలు మరి ఛార్జీలను నిర్ధారించుకోవడం మంచిది. ఈ జాబితాలోలేని దేశాలలో నివసించే భారతీయులు, ప్రయాణానికి ముందే యూఏఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విస్తరణవల్ల కెనడా, ఆస్ట్రేలియాలలో ఉన్న అనేక మంది భారతీయ ప్రయాణికులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

More Stories
ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
బ్రిటన్లో తొలి ఏఐ మంత్రిగా భారత సంతతి కనిష్క నారాయణ్
విదేశీ విద్యార్థులు సెప్టెంబర్ 15కు తిరిగి అమెరికా వచ్చేయాలి