సొంత ఎంపీలను అబద్దాలతో ప్రధాని నివాసం వద్దకు తీసుకొచ్చిన రాహుల్ 

సొంత ఎంపీలను అబద్దాలతో ప్రధాని నివాసం వద్దకు తీసుకొచ్చిన రాహుల్ 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసం ముందు రాహుల్ గాంధీ, ఆయన పార్టీ ఎంపీలు మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నీట్ పరీక్షా పత్రం లీక్ కావడం, హింసాత్మక ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సిజెపి) గుంపుపై పోలీసులు జరిపిన చర్యలకు వ్యతిరేకంగా తాను నిరసన తెలుపుతున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వాస్తవానికి, ఆ గుంపు హింసాత్మకంగా మారి పోలీసులపై దాడి చేస్తూ భారత పార్లమెంటులోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది.
 
దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి, బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఆ తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ నివాసం బయట రాహుల్ గాంధీ,  ఆయన నాయకులు ఇలా ఆందోళన చేపట్టడం భద్రతాపరమైన తీవ్ర ఉల్లంఘనగా పరిగణించబడింది. అందుకే పోలీసులు చివరికి ఆ కాంగ్రెస్ బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు.
 
అయితే, రాహుల్ గాంధీ పన్నిన ఒక కుట్రకు సంబంధించిన కొత్త విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. భద్రతా ఉల్లంఘనకు దారితీసే ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయడానికి ఆయన తన సొంత నాయకులకే అబద్ధం చెప్పారని సమాచారం.ఇండియన్ ఎక్స్‌ప్రెస్‘ కధనం ప్రకారం, రాహుల్ గాంధీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం చివరి క్షణం వరకు అత్యంత రహస్యంగా ఉంచారు. 
 
ప్రభుత్వం, ఎస్‌పిజి అప్రమత్తం కాకుండా ఉండేందుకు ఈ నిరసనను రహస్యంగా ఉంచాలని భావించిన రాహుల్ గాంధీ, తాము ప్రధాని నివాసం ముందు నిరసన తెలపడానికి వెళ్తున్నామన్న విషయాన్ని తనతో ఉన్న సుమారు 25 మంది ఎంపీలకు కూడా చెప్పలేదు. ఈ భారీ అబద్ధాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కె.సి. వేణుగోపాల్ కలిసి పన్నారని ఓ  ఎంపీ తెలిపారు. 
 
కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు, అదే ప్రాంతంలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లాలని ఆ ఎంపీలకు చెప్పారు. మల్లికార్జున ఖర్గే నివాసం ’10 రాజాజీ మార్గ్’లో ఉంది. ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసం (‘7 లోక్ కళ్యాణ్ మార్గ్’) నుండి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంటుంది. 
“పుట్టినరోజు వేడుకలు ముగిసిన తర్వాత, ఎలాంటి ప్రశ్నలూ అడగకుండా రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను అనుసరించమని మాకు చెప్పారు. మేము అలాగే చేసి ‘7, లోక్ కళ్యాణ్ మార్గ్’కు చేరుకున్నాము, అక్కడ మమ్మల్ని కూర్చోమని చెప్పారు,” అని ఆ ఎంపీ నిరసన ప్రదేశంలో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‘తో పేర్కొన్నారు. 
 
ఈ నిరసన కొనసాగుతుండగా, రాహుల్ గాంధీతో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అయితే, ప్రభుత్వం సంప్రదింపులు జరిపినప్పటికీ, రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పడం మానలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసం వెలుపల కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో రాహుల్ గాంధీ తన డిమాండ్లను మార్చారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కేంద్రం ఆయన తొలి షరతుకు అంగీకరించిన తర్వాత ఆయన కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రిగా ఉన్న సింగ్, నిరసన మొదలైన దాదాపు గంట తర్వాత అక్కడికి చేరుకుని రాహుల్ గాంధీతో క్లుప్తంగా చర్చలు జరిపారు. 
ఈ సమావేశం జరిగినప్పటికీ, ప్రభుత్వ స్పందన తమ డిమాండ్లకు అనుగుణంగా లేదని పేర్కొంటూ, ఆ చర్చలు ప్రతిష్టంభనను తొలగించడంలో విఫలమయ్యాయని కాంగ్రెస్ ఎంపీలు ఆ తర్వాత చెప్పుకొచ్చారు. ‘ఎక్స్’  వేదికగా స్పందించిన సింగ్ ఆ సంభాషణను వివరిస్తూ, నీట్  వివాదం, పేపర్ లీక్ ఆరోపణలు, దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై పార్లమెంటులో చర్చ జరపడానికి ప్రభుత్వం అంగీకరిస్తే నిరసనను విరమిస్తామని రాహుల్ గాంధీ తనకు చెప్పారని సింగ్ పేర్కొన్నారు. 
 
సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆయన వెంటనే ప్రభుత్వ అగ్రనేతృత్వం నుండి అనుమతి కోరారు. నీట్ అలాగే పరీక్షా వివాదానికి సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంటులో తప్పక చర్చిస్తామనే హామీతో తిరిగి వచ్చారు. ఆ హామీ లభించిన తర్వాత నిరసనను ముగించడానికి బదులుగా, రాహుల్ గాంధీ ఒక కొత్త షరతును విధించారని సింగ్ చెప్పారు. నిరసనను విరమించాలంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టారని ఆయన పేర్కొన్నారు.
 
పార్లమెంటులో చర్చ జరగాలన్నదే తన ఏకైక డిమాండ్ అని కొద్ది నిమిషాల క్రితమే రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని తాను ఆయనకు గుర్తుచేశానని మంత్రి పేర్కొన్నారు. అయితే, తన డిమాండ్లు ఇప్పుడు మారాయని రాహుల్ గాంధీ బదులిచ్చినట్లు సింగ్ తెలిపారు. ఆ తర్వాత, డిమాండ్లను మార్చుకోవడం తన హక్కు అని రాహుల్ గాంధీ ధీమాగా వాదించారు.
 
రాహుల్ గాంధీ హింసాత్మక శక్తులకు మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదని ఇక్కడ గమనించాలి. ఢిల్లీలో జరిగిన హిందూ వ్యతిరేక అల్లర్ల సమయంలో కూడా, రాహుల్ గాంధీ సోనియా గాంధీతో కలిసి అల్లరిమూకలకు నిరంతరం మద్దతునిస్తూ హింసను ప్రేరేపించారు. వాస్తవానికి, అల్లర్లకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించిన వాట్సాప్ గ్రూప్‌లో ఆయన సన్నిహిత సహచరుడు సచిన్ రావు సభ్యుడిగా ఉన్నారు.