టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా సంయుక్తంగా 400 మ్యాచ్‌లు ఆడిన భారత జోడీగా రికార్డు సాధించారు. వచ్చే వన్డే ప్రపంచకప్ 2027లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ జంట ప్రస్తుతానికి 50 ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు.
లార్డ్స్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో వన్డేలో ఆడడం ద్వారా ఈ మైలురాయిని అధిగమించిన మొట్టమొదటి భారత జోడీగా కోహ్లీ, రోహిత్ రికార్డు నెలకొల్పారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మరే భారత ఆటగాళ్లకు సాధ్యమవ్వని రికార్డును సొంతం చేసుకుందీ ద్వయం. ఇప్పటికే టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన రోకో లార్డ్స్ వన్డేలో ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఇక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జోడీగా శ్రీలంక దిగ్గజాలు కుమార సంగక్కర-మహేళ జయవర్ధనే కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి శ్రీలంక తరఫున 550 మ్యాచులు ఆడాకరు. ఆ తర్వాత మూడు స్థానాల్లోనూ శ్రీలంక ఆటగాళ్లే ఉండటం విశేషం.
ఇక రోహిత్, కోహ్లీల జోడీ ఈ జాబితాలో 6వ స్థానంలో కొనసాగుతోంది. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఇప్పటివరకూ 67 టెస్టులు, 159 టి-20లు, 287 వన్డేలు ఆడాడు. మొత్తం 514 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో 50 శతకాలు, 112 హాఫ్ సెంచరీలతో 20, 289 పరుగులు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264.
ఇక 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 123 టెస్టులు, 125 టి-20లు, 313 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. 28,285 రన్స్ కొట్టాడు. 85 శతకాలు బాదిన రన్ మెషీన్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 254 నాటౌట్. మరోవంక, రోహిత్ శర్మ లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో శతకంతో అదరగొట్టాడు. వన్డే ఫార్మాట్లో ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ మైదానంలో సెంచరీ బాదిన భారత తొలి బ్యాటర్‌గా నయా రికార్డు సృష్టించాడు.
39ఏళ్ల వయసులో రోహిత్ ఇలాంటి అరుదైన రికార్డు సృష్టించడం విశేషం. 84 బంతుల్లోనే రోహిత్ 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. మొత్తం 110 బంతుల్లో 138 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అందుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై వన్డేల్లో రోహిత్‌కు ఇది 8వ సెంచరీ కాగా, ఓవరాల్‌గా వన్డేల్లో 34వ శతకం.
ఇక 2004లో సౌరభ్ గంగూలీ ఇంగ్లాండ్‌పై లార్డ్స్ వన్డేలో 90 రన్స్ చేశాడు. ఇదే ఈ మ్యాచ్‌కు ముందు దాకా ఆ మైదానంలో భారత్ బ్యాటర్ సాధించిన అత్యధిక స్కోర్ ఇదే. పైగా, లార్డ్స్ మైదానంలో వన్డేల్లో సెంచరీ బాదిన అతిపెద్ద వయస్కుడిగా, భారత్ తరఫున ఏ ఫార్మాట్లో అయినా శతకం బాదిన అతిపెద్ద వయస్కుడిగానూ హిట్‌మ్యాన్ ఘనత సాధించాడు వన్డేల్లో విదేశీ గడ్డపై అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్క

More Stories
తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిన సీజేపీ ‘చలో పార్లమెంట్’
పదే పదే అంతరాయాలతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్ బలవన్మరణం