జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవ్‌లతో కూడిన ధర్మాసనం ముందు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఈ వివరాలను వెల్లడించారు. 26 మంది సభ్యుల జాతీయ నిపుణుల కమిటీ సూచించిన సిఫారసులను కేంద్రం ఆమోదించినట్లు ఆమె తెలిపారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం పాఠశాలలు, కళాశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే వయసుకు తగిన పాఠ్యాంశాలతో ‘సమగ్ర లైంగిక విద్య’ ప్రారంభమవుతుంది.
కనీసం వారానికి రెండుసార్లు 15 నుంచి 20 నిమిషాలు తప్పనిసరి తరగతులను నిర్వహించేందుకు ప్రతి పాఠశాల ఒక ప్రత్యేక నిపుణులైన ఉపాధ్యాయుడిని నియమించాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ప్రతిపాదిత పాఠ్యప్రణాళిక శరీర భద్రత, పరిశుభ్రత, శరీర భాగాలను అర్థం చేసుకోవడం, సురక్షితమైన, అసురక్షితమైన స్పర్శను గుర్తించడం వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తోంది.
విద్యార్థులు పెద్దవారయ్యే కొద్దీ పాఠాలు క్రమంగా కౌమార ఆరోగ్యం, సంబంధాలు, జీవిత నైపుణ్యాల అంశాలను బోధిస్తారు. దేశవ్యాప్తంగా ఏకరీతి పాఠ్యప్రణాళికను రూపొందించాలని కమిటీ సిఫారసు చేసింది. దీనికోసం తల్లిదండ్రుల, సంరక్షకులు, ఉపాధ్యాయుల కోసం క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వహించాలని కమిటీ తెలిపింది.
పిల్లల వికాస దశలను, వారి భద్రత, శ్రేయస్సును కాపాడటంలో సమగ్ర లైంగిక విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఈ సమావేశాలు కుటుంబాలకు ఉపయోగపడతాయని కమిటీ వెల్లడించింది. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన అదనపు కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో టీస్, క్లినికల్ సైకాలజిస్టులు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్), న్యాయ నిపుణులు సభ్యులుగా ఉన్నారు.
పెరుగుతున్న మైనర్ గర్భాల కేసులు, పోక్సో చట్టం కింద పరస్పర అంగీకారంతో కూడిన కౌమార సంబంధాలను నేరంగా పరిగణించడాన్ని నివారించే మార్గాలను పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

More Stories
కమెడియన్ సమయ్ రైనాపై`సుప్రీం’ ఆగ్రహం.. రూ 3 లక్షల జరిమానా
హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్
మూడు మందిర్-మసీదు వివాదాలలో `సుప్రీం’ మధ్యవర్తిత్వం నిరాకరణ