తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని మా దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక లిఖితపూర్వ సందేశంలో ‘‘ఖమేనీ, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ‘అమరవీరుల’ రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
‘అమరుడైన మా నాయకుడు, ఈ రెండు యుద్ధాలలోని అమరవీరులందరి రక్తానికి ప్రతిగా.. దుర్మార్గులైన, నీచమైన హంతకులపై మేము ప్రతీకారం తీర్చుకుంటాం అని ప్రతిజ్ఞ చేస్తున్నాం’’ అని ఖమేనీ ఆ సందేశంలో పేర్కొన్నారు. ఇరాన్ తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయం తన వ్యక్తిగత ఉనికిపైన గానీ, ఇతర అధికారుల ఉనికిపైన గానీ ఆధారపడి లేదని ఆయన చెప్పారు.
దాడులకు పాల్పడిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఖమేనీ హెచ్చరించారు. ‘ఈ నేరానికి బాధ్యులైన వారు ప్రశాంతంగా మంచంపై మరణించాలని కోరుకున్నా ఆ కోరిక నెరవేరదు. వారి సమాధుల వరకు ఆ కోరికను మోసుకెళ్లాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. ‘‘మేము ఉన్నా లేకపోయినా అది జరిగి తీరుతుంది’’ అని మోజ్తాబా ఖమేనీ ఉద్ఘాటించారు.
శత్రువు గుండెల్లో నిద్రపోయేలా ఇరాన్, ఇరాన్ నుంచి అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇరాన్, ఇరాక్ వ్యాప్తంగా,ముఖ్యంగా టెహ్రాన్, ఖోమ్, నజఫ్, కర్బలా, మషద్ నగరాల నుంచి శత్రువుల గుండెల్లో వణుకుపుట్టిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా కోట్లాది మంది ప్రజలు అద్భుత రీతిలో తరలివచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని మోజ్తాబా తన సందేశంలో రాసుకొచ్చారు.
ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియహాలు ముగిసిన మర్నాడే మోజ్తాబా నుంచి ఈ ప్రకటన విడుదలయ్యింది. గురువారం రాత్రి మషద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర మందిరంలో ఖమేనీ అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా వేలాది మంది మద్దతుదారులు గుమిగూడి తమ అభిమాన నేతకు కడసారి తుది వీడ్కోలు పలికారు.
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తనను హత్య చేయాలన్న ఇరాన్ ప్రణాళికల గురించి సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. ఖమేనీ ప్రకటనకు ఒక రోజు ముందు, తాను చాలా కాలంగా ఇరాన్ ‘హిట్‌లిస్ట్’లో ఉన్నానని ట్రంప్ తెలిపారు. ‘‘నేను చాలా కాలంగా ఇరాన్ లిస్ట్‌లో ఉన్నాను. మనం ఎదుర్కొంటున్నది అదే. విషయం ఒక్కటే, ఏదైనా జరిగితే, వారు మునుపెన్నడూ చూడని స్థాయిలో బాంబులు వేయమని నేను ఆదేశాలు ఇచ్చాను’’ అని ఆయన న్యూయార్క్ పోస్ట్‌తో పేర్కొన్నారు.
తనను హత్య చేయడానికి ఇరాన్ ప్లాన్ చేసినట్టు ఇజ్రాయెల్ చేసిన హెచ్చరికలపై మీడియా అడిగిన ప్రశ్నకు కొత్త ప్రణాళికలేమీ లేవని ట్రంప్ చెప్పారు. అయితే, ఇరాన్ చాలా ఏళ్లుగా తాను చనిపోవాలని కోరుకుంటోందని ఆయన ఆరోపించారు.

More Stories
ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూత!
ఆస్ట్రేలియాలో జాత్యహంకారంతో ప్రాణభయంతో భారతీయ ట్రక్ డ్రైవర్లు
కశ్మీర్‌ను పాక్ లో చూపిస్తారా?.. బంగ్లాపై నిప్పులు చెరిగిన భారత దౌత్యవేత్త!