జుడోలో అస్మితా డేకు స్వర్ణం, జావెలిన్‌ త్రోలో నీరజ్‌కు రజతం

జుడోలో అస్మితా డేకు స్వర్ణం, జావెలిన్‌ త్రోలో నీరజ్‌కు రజతం
కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారిణులు పోటాపోటీగా పతకాలు కొల్లగొడుతున్నారు. మొన్న పారా షాట్‌పుట్‌లో షర్మిలా ధన్కర్‌ మొట్టమొదటి స్వర్ణంతో చరిత్ర సృష్టించగా, జుడోలో అస్మితా డే  పసిడి వెలుగులు విరజిమ్మింది. మహిళల 48 కిలోల విభాగంలో చెలరేగిన అస్మిత కెనడా జుడోకా హెడీ క్వాచ్‌ నుచిత్తు చేసి దేశానికి నాలుగో స్వర్ణం అందించింది. అంతేకాదు  కామన్వెల్త్‌లో జుడోలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పిందీ 23 ఏళ్ల ఛాంపియన్.

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు జోరు కొనసాగుతున్నారు. జుడోలో అద్భుతంగా రాణించిన అస్మితా డే ఈ విభాగంలో దేశానికి మొట్టమొదటి పసిడి పతకాన్ని అందించింది. శుక్రవారం మహిళల 48 కిలోల ఫైనల్లో ఉడుంపట్టు పట్టిన అస్మిత కెనడా జుడోకా హెడీ క్వాచ్‌ను 2-1తో మట్టికరిపించింది. దాంతో జుడోలో మరే భారతీయురాలికి సాధ్యమవ్వని ఘనతను సొంతం

“ఈ రోజు 48 కిలోల విభాగంలో నేను అత్యుత్తమం అనుకున్నా. ఎలాగైనా ఈసారి దేశం కోసం, నా కోసం, నా కోచ్‌, తల్లిదండ్రుల కోసం స్వర్ణం గెలవాలనుకున్నా. నేను ఉత్తరప్రదేశ్ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నా. నాకు యూపీ పోలీస్‌లో ఉద్యోగం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు. అప్పటి నుంచి నాకు జుడోలో రాణించేందుకు అవసరమైన మద్దతు లభించింది. అందరి ప్రోత్సాహంతోనే నేను ఇక్కడి వరకూ వచ్చాను. గోల్డ్ మెడల్ గెలిచా. ఈ పతకాన్ని మా నాన్నకు అంకితమిస్తున్నా” అని అస్మిత భావోద్వేగంతో చెప్పింది.

 మరోవంక, భారత అథ్లెటిక్స్‌ మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా రజత పతకం సాధించగా, అరంగేట్ర ఆటగాడు యశ్‌వీర్‌ సింగ్‌ కాంస్య పతకం గెలిచి భారత జట్టుకు డబుల్‌ పోడియం అందించాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో పురుషుల జావెలిన్‌లో భారత్‌కు ఒకేసారి రెండు పతకాలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

24 ఏళ్ల యశ్‌వీర్‌ సింగ్‌ ఈ పోటీల్లో అత్యంత ఆకర్షణగా నిలిచాడు. తన చివరి, ఆరో ప్రయత్నంలో 85.41 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ మార్కును నమోదు చేసి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. గతంలో ఉన్న 83.72 మీటర్ల వ్యక్తిగత రికార్డును అధిగమించడంతో పాటు ప్రపంచ స్థాయి అథ్లెట్లు అండర్సన్‌ పీటర్స్‌, అర్షద్‌ నదీమ్‌లను వెనక్కి నెట్టి పోడియంపై నిలిచాడు.

జావెలిన్​తో పాటు జూడోలోనూ భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కొనసాగించారు. పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్, మహిళల జూడోలో అస్మితా దే స్వర్ణ పతకం గెలిచారు. తాజా విజయాలతో భారత్ 5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలు కలుపుకుని మొత్తం 23 పతకాలతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది.