దిల్‌సుఖ్‌నగర్‌ ఆలయంలో అమ్మవారి విగ్రహంపై కర్రలతో దాడి

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో శుక్రవారం ఉదయం కలకలం రేగింది. ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి పూజారిపై దాడికి యత్నించడంతో పాటు అమ్మవారి విగ్రహంపై కర్రతో దాడి చేసినట్లు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఈ ఘటనను గమనించిన భక్తులు వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 
 
ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దిల్‌సుఖ్‌నగర్ బస్ డిపో సమీపంలో ఉన్న సంతోషిమాత ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించగా, అతడి చేతిలో ఉన్న కర్రతో పూజారిపై దాడికి ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడితో ఆగకుండా అమ్మవారి విగ్రహాన్ని కర్రతో కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
దీంతో ఆలయంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పూజారిపై దాడికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని గమనించిన భక్తులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. అనంతరం పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.  చైతన్యపురి పోలీసులు వెంటనే ఆలయానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ సైదులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని మహమ్మద్ అన్సారీగా గుర్తించారు.  అమ్మవారిపై దాడి చేయడం వెనుక అతడి ఉద్దేశం ఏంటి అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. 
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఆలయంలో, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడు ఆలయంలోకి ఎలా వచ్చాడు? ఘటనకు ముందు అతడి కదలికలు ఎలా ఉన్నాయి? అనే అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

సంతోషిమాత ఆలయంలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూజారి, ఆలయ సిబ్బంది, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను దర్యాప్తు అనంతరం వెల్లడించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసిన భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పట్టపగలు గుడిలోకి ప్రవేశించి, ఇలా అమ్మవారి విగ్రహంపై దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

 
సంతోషిమాత మందిర్ లో  ఒక ముస్లిం యువకుడు అక్రమంగా ప్రవేశించి, దుర్గామాతపై దాడికి పాల్పడటం దుర్మార్గమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తీవ్రంగా ఖండించారు.  ప్రశాంతమైన భాగ్యనగర్ లో మళ్ళీ మత చిచ్చురేగేందుకు కొన్ని ముస్లిం మూకలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. 
 
శుక్రవారం రోజు అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు చేస్తున్న క్రమంలో ఉదయం మహమ్మద్ అన్సారీ అనే దుర్మార్గుడు మందిరంలోకి ప్రవేశించి పవిత్రమైన గర్భగుడిలోని అమ్మవారి విగ్రహం పై దాడికి పాల్పడటం అమానుషం మండిపడ్డారు. అలాంటి యువకుడిని పట్టుకొని చట్టపరమైన రీతిలో శిక్షించాల్సింది పోయి పోలీసులే అతడిని పిచ్చివాడిగా గుర్తిస్తూ సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందని బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అయితే దాడికి పాల్పడిన వ్యక్తి ఇంగ్లీషులో స్పష్టంగా మాట్లాడుతూ హిందువులను అంతం చేస్తా అంటూ హిందూ మహిళలను తీవ్రస్థాయిలో దుర్భాషలాడినట్లు ఆయన వివరించారు. పోలీసులు ఇచ్చే పిచ్చి సర్టిఫికెట్ అందుకొని కొంతమంది ముస్లిం టెర్రరిస్టులు నేరుగా హిందూ దేవాలయాలు లోకి ప్రవేశించి దాడులకు తెగబడుతున్నారని ఎద్దేవా చేశారు.
 
విత్రమైనటువంటి దసరా నవరాత్రి ఉత్సవాలు, దీపావళి పండుగకు ముందు ఇలాంటి దుర్మార్గపు చర్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని బాలస్వామి డిమాండ్ చేశారు. ప్రశాంతమైన నగరంలో మత చిచ్చు పెట్టేందుకు కొంతమంది ముస్లింలు కుట్ర పన్నుతున్నారని పేర్కొంటూ అలాంటి కుట్రదారుల వెనుక ఉన్నటువంటి దుష్టశక్తులను గుర్తించి  తగిన రీతిలో చట్టపరమైన శిక్ష విధించాలని ఆయన కోరారు.  ప్రతి మందిరానికి, దుర్గామాత మండపానికి పోలీసులు భద్రత కల్పించాలని బాలస్వామి డిమాండ్ చేశారు.

About The Author