“మానస్, మహాభారతం” అంతర్జాతీయ నాగరికతా అధ్యయన కేంద్రం

“మానస్, మహాభారతం” అంతర్జాతీయ నాగరికతా అధ్యయన కేంద్రం
“మానస్, మహాభారతం” అంతర్జాతీయ నాగరికతా అధ్యయన కేంద్రం అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి, ఒక భారత ప్రతినిధి బృందం 2026 జూలై 4 నుండి 7 వరకు కిర్గిజ్‌స్థాన్‌లో పర్యటించింది. ఈ కేంద్రాన్ని మానస్ నేషనల్ అకాడమీ, భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (సిఎస్ఐఆర్) సహకారంతో స్థాపించారు. ఈ వేడుకలో భాగంగా, మానస్ నేషనల్ అకాడమీ, సిఎస్ఐఆర్, కిర్గిజ్‌స్థాన్‌లోని 7 ప్రముఖ విశ్వవిద్యాలయాల మధ్య త్రైపాక్షిక సహకార ఒప్పందాలపై కూడా సంతకాలు జరిగాయి.
 
ఈ కార్యక్రమంలో కిర్గిజ్ ఇతిహాసం “మానస్” మొదటి హిందీ అనువాదాన్ని కూడా సమర్పించారు. భారతదేశంలోని కిర్గిజ్ రాయబార కార్యాలయం,  కిర్గిజ్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ కార్యక్రమానికి సహకారం అందించాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
ఈ ప్రతినిధి బృందంలో ప్రముఖ భాషావేత్త, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని రష్యన్ భాషా సాహిత్య కేంద్రం మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ హేమ్ చంద్ర పాండే; ఇండియా-సెంట్రల్ ఆసియా ఫౌండేషన్ ఛైర్మన్, మెరి సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామకాంత్ ద్వివేది; యు సిఎస్ఐఆర్ గౌరవ డైరెక్టర్ అయిన డాక్టర్ పునీత్ గౌర్ కూడా ఉన్నారు. 
 
భారత ప్రతినిధి బృందం బిష్కెక్‌లో, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుని పరిపాలనలోని రాజకీయ, ఆర్థిక అధ్యయనాల విభాగం డిప్యూటీ హెడ్, వ్యూహాత్మక ప్రణాళిక, సంస్కరణల విశ్లేషణ విభాగం అధిపతి అక్ట్యాబ్ర్ కపాల్‌బాయేవ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించింది. తదనంతరం, అక్ట్యాబ్ర్ కపాల్‌బాయేవ్‌తో పాటు కిర్గిజ్ రిపబ్లిక్ సైన్స్, ఉన్నత విద్య, ఆవిష్కరణల ఉప మంత్రి దురుస్బెక్ కోజుయేవ్; కిర్గిజ్ రిపబ్లిక్ సంస్కృతి, సమాచారం, క్రీడలు, యువజన విధానాల ఉప మంత్రి శ్రీమతి సల్కిన్ సర్నోగోయేవా; కిర్గిజ్ రిపబ్లిక్‌కు భారత రాయబారి బీరేందర్ సింగ్ యాదవ్ లుకోకోడా హాజరయ్యారు.
 
సునీల్ అంబేకర్, భారత్, కిర్గిజ్‌స్థాన్ ప్రజల మధ్య ఉన్న సుదీర్ఘ సాంస్కృతిక సంబంధాలను నొక్కిచెప్పారు. సాంప్రదాయ సాంస్కృతిక విలువలలో, ముఖ్యంగా మానవ విలువలకు ఇచ్చే ప్రాధాన్యతలో ఉన్న గణనీయమైన సారూప్యతలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. మహాభారతం భారతీయ సంస్కృతిపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపగా, ‘మానస్’ ఇతిహాసం వేల సంవత్సరాలుగా కిర్గిజ్ ప్రజలకు ఒక ప్రధాన సాంస్కృతిక శక్తిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
 
అనువాదకులుగా ప్రొఫెసర్లు రామకాంత్ ద్వివేది, హేమ్ చంద్ర పాండేలు చేసిన గణనీయమైన కృషిని అంబేకర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ అకాడమీ మానస్ చేపట్టిన ఒక చారిత్రాత్మక చొరవగా అభివర్ణిస్తూ, నేషనల్ అకాడమీ ఆఫ్ “మానస్” అధ్యక్షురాలు ప్రొఫెసర్ నజీరా అలీ కైజీ, శ్రీమతి గుల్జాత్‌ల అంకితభావంతో కూడిన కృషిని ఆయన అభినందించారు.  అలాగే “మానస్ అండ్ మహాభారత” అంతర్జాతీయ నాగరికతా అధ్యయనాల కేంద్రం ప్రారంభోత్సవానికి తన శుభాకాంక్షలు తెలిపారు. 
 
భారతదేశం, కిర్గిజ్‌స్థాన్‌ల మధ్య శాస్త్రీయ, విద్యా, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ కొత్త కేంద్రం ఒక వేదికగా ఉపయోగపడుతుందని డాక్టర్ పునీత్ గౌర్ పేర్కొన్నారు. యూరేషియన్ సంస్కృతుల మధ్య సంబంధాలను పెంపొందించడానికి ఒక నాగరికతా సంభాషణల వేదికను ఏర్పాటు చేయాలన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు ఈ కేంద్రం అనుగుణంగా ఉందని ఆయన తెలిపారు. 
 
ఇతిహాస వారసత్వం, నాగరికతా ప్రక్రియలు, చరిత్ర, సంస్కృతి, అంతర-సాంస్కృతిక సంభాషణ, మానవతా దౌత్యం వంటి వాటి అధ్యయనానికి ఈ కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందని డాక్టర్ గౌర్ వివరించారు. ఈ కేంద్రం తులనాత్మక నాగరికతా అధ్యయనాలు, మహాభారత, మానస్ ఇతిహాస సంప్రదాయాలు, రెండు దేశాల సాంస్కృతిక వారసత్వం, మానవతా దౌత్యాన్ని అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ శాస్త్రీయ సహకారాన్ని ప్రోత్సహించడం, వర్ధమాన పరిశోధకులకు శిక్షణ ఇవ్వడం వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. 
 
ప్రముఖ భారతీయ పండితులైన ప్రొఫెసర్ హేమ్ చంద్ర పాడే మరి,యు ప్రొఫెసర్ రామకాంత్ ద్వివేది, కిర్గిజ్ ఇతిహాసం “మానస్” మొట్టమొదటి హిందీ అనువాదాన్ని సమర్పించడం కూడా ఈ వేడుకలోని ఒక ముఖ్య ఘట్టం. తన ప్రసంగంలో ప్రొఫెసర్ రామకాంత్ ద్వివేది, ఈ అనువాదం కిర్గిజ్ రిపబ్లిక్ ప్రజారచయిత అయిన మార్ బైఝీవ్  రష్యన్ పద్య పునఃకథనంపై ఆధారపడిందని, మరియ ఇతిహాస కావ్యంలోని “మానస్,” “సెమెటే,” “సైటెక్” అనే మూడు భాగాలను ఇది కలిగి ఉందని వివరించారు.
 
ఈ ప్రచురణ భారతీయ పాఠకులకు కిర్గిజ్ ఇతిహాస వారసత్వాన్ని పరిచయం చేయడం, రెండు దేశాల మధ్య విద్యా సహకారాన్ని ప్రోత్సహించడం, అలాగే ఇతిహాస అధ్యయనాలు, నాగరికతా అధ్యయనాలు, మానవతా దౌత్యంలో సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. భారత ప్రతినిధి బృందం చింగిజ్ ఐత్మాటోవ్ హౌస్ మ్యూజియం, అటా-బేయిట్ జాతీయ చారిత్రక, స్మారక సముదాయాన్ని కూడా సందర్శించింది.