ఈ కారణాలతో 54.4 శాతం మంది రెసిడెన్సీ(తమ పీజీ సీటు) వదిలి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారని వివరించింది. 16.9 శాతం మంది ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 69.1 శాతం మంది తీవ్రమైన పని భారం ఉందని తెలిపారు. 46.7 శాతం మంది వారానికి 80 గంటలు పని చేస్తున్నామని, 20.3 శాతం మంది వారానికి 100 గంటలకు పైగా పనిచేస్తున్నామని వెల్లడించారు.
ఆరోగ్యరంగంలో సిబ్బంది కొరత, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వ్యవస్థ లేకపోవడం, సకాలంలో ైస్టెఫండ్ అందకపోవడం, బాండ్ పాలసీలు (కోర్సు మధ్యలో వదిలి వెళితే విధించే భారీ జరిమానాలు), పనిభారంతో అకడమిక్ కోర్సుపై ఎఫెక్ట్ పడుతున్నదని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. రెసిడెంట్ డాక్టర్ల సంరక్షణకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సర్వే సూచించింది. రెసిడెంట్ డాక్టర్ల పనివేళలపై జాతీయ స్థాయిలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేసింది.
ఎక్కువ సేపు షిఫ్టుల్లో పనిచేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి చేయాలని, వైద్యుల కొరతను తీర్చేందుకు వెంటనే నియామకాలు చేపట్టాలని పేర్కొన్నది. ఏకధాటిగా 36 గంటల డ్యూటీలు వేయవద్దని కోరింది. ప్రతి మెడికల్ కాలేజీలో మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉంచడంతో పాటు దేశవ్యాప్తంగా ఒకే విధమైన స్టెఫండ్ విధానం అమలు చేయాలని సూచించింది.
బాండ్ పాలసీ, జరిమానాల్లో సవరణలు చేయాలని, ఎప్పటికప్పుడు రెసిడెంట్ డాక్టర్ల సంక్షేమాన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలని సూచించింది. రోగుల భద్రత, నాణ్యమైన వైద్య విద్యను దృష్టిలో ఉంచుకొని రెసిడెంట్ డాక్టర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని సర్వే అభిప్రాయపడింది.

More Stories
అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
సముద్ర గర్భంలో శత్రువుల వేటలో ఛత్రపతి శివాజీ పులిగోరుతో యుద్ధనౌక
ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయం కూల్చివేత