జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో పహల్గాం దాడి ఘటనతో సంబంధం ఉన్న లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది కూడా ఉన్నట్లు భద్రతా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని పోషియాన్ జిల్లాలో ఇనివారం రాత్రి ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
హోరాహోరీగా సాగిన ఈ ఎన్కౌంటర్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ కి చెందిన కీలక ఆపరేటివ్ జాకీర్ అహ్మద్ గనీతో పాటు, అతని ప్రధాన అనుచరుడు లతీఫ్ భట్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడం కశ్మీర్ లోయలో ఉగ్రవాద నెట్‌వర్క్‌కు పెద్ద దెబ్బగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం పోషియాన్ జిల్లా చన్‌పోరా గ్రామంలో రాత్రి 7:45 గంటల సమయంలో భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యానికి చెందిన 44, 20, 34 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్లు, మూడు పారా, జమ్మూకశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్స్ సంయుక్తంగా నిర్వహించాయి ఎన్కౌంటర్లో మృతిచెందిన జాకీర్ గనీ దక్షిణ కాశీలోని కుల్గాం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. భద్రతా బలగాలు అతడిని ఏ ++ కేటగిరి ఉగ్రవాది లిస్ట్‌లో ఉంచాయి.
2025 అక్టోబర్‌లో ఎన్ఐఏ కోర్టు అతన్ని వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. పహల్గామ్ ఉగ్రదాదిలోనూ జాకీర్ గనీ పేరు వెలుగులోకి వచ్చింది. పహల్గామ్ దాడితో పాటు భద్రతా సిబ్బందిపై దాడులు, కశ్మీర్ లోయలో టార్గెట్ చేసుకుని ఎంతో మంది హతమార్చిన ఘటనల్లో కూడా అతని ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
జాకీర్ అహ్మద్ గనీపై గతంలో పలు కీలక ఉగ్రవాద కేసులు ఉన్నాయి.
ముఖ్యంగా పర్యాటక ప్రాంతమైన పహాల్గమ్ పరిసరాల్లో జరిగిన ఘోర ఉగ్రదాడులతో పాటు, భద్రతా బలగాలే లక్ష్యంగా జరిగిన పలు దాడుల కేసుల్లో ఇతడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు ఉగ్రవాదులు స్థానికంగా అలజడి సృష్టించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
ఎన్కౌంటర్ జరగడానికి కొద్దిసేపటి ముందే వీరిద్దరూ ఆయుధాలతో సంచరిస్తున్న దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ లూప్‌హోల్ ఆధారంగానే భద్రతా దళాలు వీరి కదలికలను నిశితంగా గమనించి, పక్కా వ్యూహంతో ఉచ్చు బిగించి మట్టుబెట్టాయి. ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు, మందుగుండు సాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. భారత సైన్యం కంబైండ్ ఆపరేషన్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది.

More Stories
హర్యానాలో ఇద్దరు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు హతం
యూఏపీఏ చట్టం పరిధిలోకి 23 మంది పాక్ ఉగ్రవాదులు
ఇస్రోను పేల్చేస్తామంటూ ఈమెయిల్