అంతకుముందు ప్రమాదం జరగగానే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో గోడౌన్‌లో పెద్ద సంఖ్యలో కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పైకప్పు కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకోగా, వారిలో కొందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భారీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
సహాయక చర్యలు జరుగుతున్న ప్రమాద స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి సువేందు అధికారి, శిథిలాల కింద మరో 18 మంది వరకు చిక్కుకుని ఉన్నారని తెలిపారు. అక్కడ సైన్యంతో సహా రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. కూలిపోయిన గిడ్డంగి నగరంలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ పరిధిలో లీజుకు ఇవ్వబడిన ఆస్తి అని ఒక అధికారి తెలిపారు.

More Stories
ఉధంపూర్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
పెల్లెట్ గన్ వాడకంపై దర్యాప్తు కమిటీ మార్పుకు సుప్రీం నిరాకరణ
భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ‘యుద్ధ అభ్యాస్’