పోలీస్ స్టేషన్ లోపల హింసాత్మక ఘటన జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే, తాను పోలీస్ స్టేషన్‌కు తిరిగి వచ్చానని ఆయన తెలిపారు. ‘‘నేను పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే, మేజర్ వికాస్ శర్మ నేతృత్వంలో సైనికులు నాపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో, వారు నా యూనిఫాం చించి, అథోలి డీఎస్పీ విజయ్ కుమార్ భగత్‌పై కూడా భౌతిక దాడికి దిగారు’’ అని ఎఫ్‌ఐఆర్‌లో ఉంది.
ఇది పథకం ప్రకారం జరిగిన దాడేనని, పలువురు పోలీసులు గాయపడ్డారని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం సైనికులు లాఠీలు, ఇనుప రాడ్లు, వారి సర్వీసు ఆయుధాలతో ప్రధాన గేటు, ప్రహరీ గోడలను ఎక్కి పోలీస్ స్టేషన్‌లోకి బలవంతంగా ప్రవేశించారు. నివేదికల ప్రకారం, కిష్టావర్ అసిస్టెంట్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ సైన్యానికి చెందిన ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వారు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు.
స్టేషన్‌పై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఆర్టీఓ, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారులపై కూడా సైనికులు దాడి చేశారని ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. ‘‘ఆర్టీఓ , అథోలి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ, డీఎస్పీ వాహనాలను ధ్వంసం చేసి, మెయిన్ గేటును పగలగొట్టి, ప్రభుత్వ, ప్రజా ఆస్తులకు కూడా తీవ్ర నష్టం కలిగించారు’’ అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగిందని, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని ‘చంపాలని’ సైనికులు కోరుకున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
‘‘పూర్తిస్థాయిలో సిద్ధమై లాఠీలు, ఇనుప రాడ్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రితో మెయిన్ గేటు, ప్రహరీ గోడలను దూకి అథోలి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి చొరబడ్డారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి ప్రాణాంతక గాయాలు కలిగించి, వారిని చంపాలన్నది వారి ఉద్దేశం. బలవంతపు ప్రవేశం, దాడి గురించి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ అందిన వెంటనే, నేను హుటాహుటిన వచ్చాను’’ అని పోలీస్ అధికారి వివరించారు.

More Stories
కోల్‌కతా గిడ్డంగి కూలిన ఘటనలు 10కి పెరిగిన మృతులు
ఎమర్జెన్సీ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి
9వ తరగతి పాఠ్యపుస్తకంలో ఎమర్జెన్సీని చేర్చిన ఎన్సీఈఆర్టీ