ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారతీయ నావికుల భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ జీ7 సదస్సులో చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెల్పడం ద్వారా మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ మరోసారి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టివేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం సందర్భంగా ఈ అంశంపై ప్రధాని మౌనంగా ఉన్నారని ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తున్న సమయంలో ఇలా ఆయన మోదీకి మద్దతుగా నిలిచారు.
ఇరాన్ ఘర్షణలో నావికుల భద్రతకు సంబంధించి భారత్ ఆందోళనలను ప్రధాని మోదీ ట్రంప్‌కు చెప్పారని, యుద్ధ సమయంలో వాణిజ్య నౌకా సిబ్బంది లక్ష్యంగా మారకూడదని ఆయన గుర్తుచేశారని శశి థరూర్ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై స్వదేశంలో ఆగ్రహం పెరుగుతున్నప్పటికీ ప్రధాని ఈ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించడంలో విఫలమయ్యారని, ట్రంప్ నుంచి ఎందుకు క్షమాపణ గానీ, విచారం గానీ కోరలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
ఈ నేపథ్యంలో థరూర్ వ్యాఖ్యల్ని బీజేపీ అందిపుచ్చుకుంది. ప్రధానిపై శశిథరూర్ ప్రశంసలు రాహుల్ గాంధీ బండారం బయటపెట్టాయని పేర్కొంది. కాంగ్రెస్ నాయకులు ప్రధాని @నరేంద్రమోదీజీ దౌత్యనీతిని బహిరంగంగా ప్రశంసిస్తున్నారని, జాతీయ ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రధాని మోదీకే మొదటి స్థానం అని తెలిపింది. భారతదేశ జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడే విషయంలో రాహుల్ గాంధీ అందరినీ వెనక్కి నెట్టేస్తారని మండిపడుతూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

More Stories
అయోధ్య అంశాన్ని 2027 అసెంబ్లీ ఎన్నికల్లోకి లాగే ప్రయత్నం
భగవంత్ మాన్ హాజరు వీడియోను విడుదల చేసిన అకల్ తఖ్త్
ఎఫ్ఏటీఎఫ్ ఉపాధ్యక్షునిగా మొదటిసారి భారతీయ అధికారి అగర్వాల్