* హర్మూజ్ దాటిన మూడు భారత నౌకలు
హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో, రిఫైనరీలు సరఫరాలను సురక్షితం చేసుకునేందుకు ప్రయత్నించడంతో, జూన్ నెలలో భారతదేశం రష్యా నుండి తన ముడి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకోగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుండి కొనుగోళ్లు రికార్డు స్థాయికి దగ్గరగా కొనసాగాయి. సముద్రయాన, వస్తువుల నిఘా సంస్థ అయిన క్ప్లర్ (డేటా ప్రకారం, జూన్ 1 నుండి జూన్ 19 మధ్య భారతదేశం రష్యా నుండి రోజుకు సగటున 2.66 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది.
మే నెలలో నమోదైన 1.91 మిలియన్ బ్యారెళ్లతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. దీనితో భారతదేశానికి అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా రష్యా స్థానం మరింత బలపడింది. ఇదే కాలంలో యూఏఈ నుండి దిగుమతులు రోజుకు సుమారు 636,000 బ్యారేళ్ళుగా ఉన్నాయి. ఇది మే నెలలో నమోదైన రికార్డు స్థాయి 644,000 బ్యారెళ్ల కన్నా కొద్దిగా తక్కువ.
వెనిజులా సగటున రోజుకు 209,000 బ్యారెళ్ల సరఫరాలతో భారతదేశానికి నాల్గవ అతిపెద్ద సరఫరాదారుగా అవతరించగా, సౌదీ అరేబియా సుమారు 384,000 బ్యారెళ్ల సరఫరా చేసింది. దీనికి విరుద్ధంగా, క్ప్లర్ డేటా ప్రకారం, అమెరికా నుండి ముడి చమురు దిగుమతులు ఒక నెల క్రితం 252,000 బ్యారెల్స్ నుండి జూన్‌లో 91,000 బ్యారెల్స్‌కు గణనీయంగా పడిపోయాయి.
ఈ తాజా దిగుమతుల గణాంకాలు, భారతదేశం తన ఇంధన వనరులను వైవిధ్యపరచడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ప్రతిబింబిస్తున్నాయి. పోటీ ధరల కారణంగా రష్యా ముడి చమురు ఆకర్షణీయంగానే ఉంది. అదే సమయంలో యూఏఈ నుండి పెరిగిన కొనుగోళ్లు, హోర్ముజ్ జలసంధిలో అంతరాయాలతో ముడిపడి ఉన్న సరఫరా ప్రమాదాలను ఎదుర్కోవడంలో రిఫైనరీలకు సహాయపడ్డాయి.
కాగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూడు భారత జెండా కలిగిన భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు విజయవంతంగా దాటాయి. 8.6 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో ఈ నౌకలు ప్రస్తుతం భారత ఓడరేవుల వైపు ప్రయాణిస్తున్నాయి. ‘దేశ్ వైభవ్’, ‘దేశ్ విభోర్’, ‘సన్మార్ హెరాల్డ్’ అనే మూడు నౌకలు 94 మంది భారత సిబ్బందితో హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు.
ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధన దిగుమతిదారు అయిన భారతదేశం, ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ), ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) కోసం విదేశీ సరఫరాలపై ఎక్కువగా ఆధారపడుతుంది.

More Stories
టీఎంసీ బ్యాంకు ఖాతాల్లో రూ 440 కోట్లు ఫ్రీజ్
రిలయన్స్ జియో ఐపీవోకు రంగం సిద్ధం
ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కు ఎదురుదెబ్బే