రిలయన్స్ జియో ఐపీవోకు రంగం సిద్ధం

రిలయన్స్ జియో ఐపీవోకు రంగం సిద్ధం
  • ప్రతి ఇంటిని స్మార్ట్‌హోంగా మార్చే ప్రయత్నం 

భారతీయ పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఐపీవోకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఐపీవోకు అవసరమైన పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్త సెబీకి శుక్రావారం సంస్థ సమర్పించింది. ఈ విషయాన్ని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వెల్లడించారు. ముంబైలోని రిలయన్స్ సంస్థ ప్రధాన కార్యాలయంలో రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం) సందర్భంగా రిలయన్స్ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన వివరాల్ని సంస్థ అధినేత ముకేష్ అంబానీతో పాటు జియో ఎండీ ఆకాశ్ అంబానీ వెల్లడించారు.

సెబీ నుంచి దీనికి అనుమతులు వచ్చిన తర్వాత రిలయన్స్ జియో సంస్థ ఐపీవోకు వెళ్తుంది. ఈ ఐపీవో ద్వారా సుమారు 3 బిలియన్ డాలర్లు (రూ.25 వేల కోట్లు) నిధులు సేకరించాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీని ద్వారా 27 కోట్ల కొత్త షేర్లను కంపెనీ జారీ చేస్తుంది. రిలయన్స్ సంస్థ కొన్ని కొత్త టెక్నాలజీలను కూడా ప్రవేశపెట్టింది. అవి జియో టెలిఫ్రేం, జియో కాల్ ఏజెంట్. జియో టెలిఫ్రేం.. వాయిస్ ఫస్ట్ ఏజెంటిక్ ఏఐ. ప్రతి ఇంటిని స్మార్ట్‌హోంగా మార్చేందుకు రూపొందింది. 

ఇంట్లో, రోజువారీ జీవితంలో చేసే అనేక పనుల్ని ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా నిర్వహించవచ్చు. హోం మేనేజ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్ అసిస్టెన్స్, గెస్ట్ మేనేజ్‌మెంట్, ఫ్యామిలీ కేర్ సర్వీసెస్ వంటివి దీని ద్వారా చేసుకోవచ్చు. హేజియో పేరుతో రిలయన్స్ సంస్థ కొత్త కాల్ ఏజెంట్‌ను తీసుకొచ్చింది. రిలయన్స్ నెట్‌వర్క్ వాడుతుంటే చాలు ప్రత్యేకంగా యాప్ డౌన్‌లోడ్ చేయకుండానే దీన్ని వాడుకోవచ్చు. ఫోన్ కాల్ మధ్యలో ‘హేజియో’ అంటే చాలు ఇది యాక్టివేట్ అవుతుంది.

ఒక కాల్ మాట్లాడుతున్నప్పుడే క్యాబ్ బుక్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, రెస్టారెంట్‌లో సీట్ రిజర్వ్ చేయడం, మీటింగ్ సెట్ చేయడం వంటి టాస్క్‌లు ఇది పూర్తి చేస్తుంది. ఈ ఏడాది చివరికల్లా ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ కాల్ మధ్యలో కూడా దీన్ని వాడొచ్చు. 10 మంది వరకు కాలర్స్ ఉన్నప్పుడు స్పీకర్‌ను గుర్తించడం, కావాల్సిన లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌క్రిప్షన్ అందించడం, కాల్ తర్వాత సమ్మరైజ్ అందించడం, రిమైండర్స్ వంటివి చేస్తుంది. 

జియో నెట్‌వర్క్ వాడే అందరూ యూజ్ చేసే మై జియో యాప్ త్వరలో పర్సనల్ ఏఐ రిలేషన్‌షిప్ మేనేజర్‌గా మారుతుంది. దీని ద్వారా టెలికాం సేవల్ని సులభంగా పొందవచ్చు. కావాల్సిన రోమింగ్ ప్లాన్స్‌ను సులభంగా ఎంచుకోవచ్చు. రొటీన్ అకౌంట్ చెక్కులను కూడా ఆటోమేటిక్‌గా పొందవచ్చు.