పలు అంశాల వల్ల ఇంధన ధరలను వెంటనే తగ్గించలేమని సురేశ్ గోపి తేల్చిచెప్పారు. ఇటీవల ఇంధన ధరల్లో నమోదైన పెరుగుదలపై స్పందించిన సురేశ్ గోపి, లీటర్కు సుమారు రూ.3.94 మేర పెరుగుదల ప్రభావం మాత్రమే వినియోగదారలపై పడిందని తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గాయని చెప్పి వెంటనే ఆ పెరుగదలను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరి, యుద్ధం ముగియడంతో ముడి చమురు ధరలు ఇప్పటికే 30 వరకు తగ్గడంతో ఇటీవల పెంచిన ఇంధన ధరలను తగ్గించాలని వస్తున్న డిమాండ్లపై మంత్రి స్పందించారు.
చౌకైన ముడి చమురును భారత్‌కు తీసుకురావడనాకి హర్మూజ్ జలసంధి గుండా రవాణా చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఆ మార్గంలో నౌకల రాకపోకలు అధికంగా ఉండటంతో పరిస్థితలు సాధారణ స్థితికి చేరేందుకు కొంత సమయం పడుతుందని ఆయన వివరించారు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని సురేష్ గోపీ తెలిపారు.
పెరిగిన వ్యయభారాన్ని కొంత మేర కేంద్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు. ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.12 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అధిక ఇంధన ధరల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని తగ్గించుకునేలా పన్నుల్లో తగ్గింపు చేయలేదని, అయితే కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు వ్యవస్థను కొనసాగించాల్సిన బాధ్యతను నిర్వర్తించాయని ఆయన వివరించారు.

More Stories
అపోలో హాస్పిటల్స్ `ఫెమా’ ఉల్లంఘన.. రూ.17.76 కోట్ల జరిమానా
భారత్లో డిజిటల్ మోసాల ముప్పు దాదాపు రెట్టింపు
మేలో 9.68 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం