పాట్నాకు సమీపంలో, గంగా నది తీరానికి దగ్గరగా, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇక్కడ స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు అత్యంత వైభవంగా కళ్యాణ మండపం, పవిత్రమైన పుష్కరిణిని ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు.
ఈ ఆలయ నిర్మాణం ద్వారా ఉత్తర భారతదేశ భక్తులకు కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు మరింత చేరువవుతాయని సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాలను టీటీడీ వేగవంతం చేసిందని, ఇప్పటికే అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో ఆలయ నిర్మాణానికి పది ఎకరాల భూమి కేటాయించారని టీటీడీ చైర్మెన్ తెలిపారు.
బీహార్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మితమైతే, అది హిందూ ధర్మ పరిరక్షణకు, సనాతన సంస్కృతి విస్తరణకు ఒక ప్రముఖ కేంద్రంగా మారుతుందని చెప్పారు. భక్తులకు ఉన్నతమైన ఆధ్యాత్మిక సేవలు అందించడానికి, స్థానికంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ క్షేత్రం ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు. భక్తుల సౌకర్యార్థం ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More Stories
వికసిత భారత్ నిర్మాణంలో రైల్వేలే కీలకం
దేశ సమగ్రతను బలి చేసేందుకు కొన్ని దేశద్రోహ శక్తులు
సీఎం చంద్రబాబు మామిడి రైతులను ఆదుకోవాలి