ఇక భారత మహిళల జట్టు కాంస్య పతక పోరులో పటిష్ట కొరియాను చిత్తు చేసింది. మూడవ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0 గోల్స్ తేడాతో కొరియాపై విజయాన్ని నమోదు చేసింది. సందీప్ కుమారి, స్వీటీ కుజుర్, నౌషీన్ నాజ్‌లు భారత్ తరపున గోల్స్ చేశారు. సెమీఫైనల్స్ మ్యాచ్‌లో చైనా చేతిలో షూటౌట్ ఓడిన భారత జట్టు కాంస్య పతకం కోసం గట్టిగా పోరాడింది. ఆరంభంలోనే డ్రీమ్ స్టార్ట్ అందింది.
తొలి రెండు నిమిషాల్లోనే సందీప్ కుమారి గోల్స్ చేసింది. దీంతో ఇండియా ఈ మ్యాచ్‌లో దూకుడు ప్రదర్శించింది. మ్యాచ్ మొత్తం ఇండియా జట్టు అటాక్ చేసింది. ఈ టోర్నీలో నౌషీన్ తన ఖాతాలో మొత్తం 12 గోల్స్ చేసింది. సందీప్ కుమారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది.
అండర్-18 ఆసియా కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో మెరిసిన భారత పురుష, మహిళల హాకీ జట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని యువ ఆటగాళ్లు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. “టోర్నీ అంతటా అసాధారణ నైపుణ్యం, జట్టు సమన్వయాన్ని ప్రదర్శించి ఫైనల్లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ విజయం యువతలో హాకీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.

More Stories
షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గాం దాడి సూత్రధారి
ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య చరిత్రాత్మక ఒప్పందం
డెన్మార్క్ లో ఇస్లామిక్ ప్రార్థన `అజాన్’పై దేశవ్యాప్త నిషేధం!