న్యూ ఢిల్లీలో శనివారం ఈ మెగా టోర్నీ కోసం జరిగిన రెజ్లర్ల ఎంపిక పోటీల్లో వినేశ్ ఓటమి పాలైంది. 50 కిలోల విభాగలో పోటీపడేందుకు రెజ్లింగ్ సమాఖ్య అనుమతించకపోవడంతో 53 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఆమె తొలి పోరులో జ్యోతిని 7-1తో ఓడించింది. అదే ఉత్సాహంతో క్వార్టర్ ఫైనల్లో నిషిని 5-0తో చిత్తు చేసిన వినేశ్ జోరుకు మీనాక్షి గోయత్ చెక్ పెట్టింది.
కానీ, సెమీఫైనల్లో ఉడుంపట్టుతో ఒలింపిక్ విజేతను రెండు పాయింట్ల(4-6) తేడాతో ఓడించింది మీనాక్షి. దాంతో, ఏడాది జపాన్‌లో జరుగనున్న ఆసియా క్రీడల్లో కుస్తీ పట్టాలనుకున్న వినేశ్‌కు నిరాశే మిగిలింది. వినేశ్ – నిషి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నాటకీయంగా సాగింది. తొలి మూడు నిమిషాల్లో 0-5తో వెనుకంజలో ఉన్న వినేశ్ గొప్పగా పుంజుకొని నిషిని పడగొట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే రిఫరీ విజిల్ వేసి నాలుగు పాయింట్లు కేటాయించాడు.
అయితే, అతడి నిర్ణయాన్ని వినేశ్ సవాల్ చేసి రివ్యూ గెలిచింది. ఆమె భర్త సోమ్విర్ రథీ కూడా నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. చివరకు 7-6తో ఆసియా క్రీడలకు అర్హత సాధిస్తుందనుకున్న వినేశ్ ఆశలపై సెమీస్ ప్రత్యర్థి మీనాక్షి నీళ్లు చల్లింది. ఫైనల్లో మీనాక్షిని 3-2తో ఓడించిన అంతిమ్ పంగాల్ ఆసియా క్రీడల 53 కిలోల విభాగంలో ఎంపికైంది.
ఈ పరాజయంపై వినేశ్ ఫొగాట్ భావోద్వేగానికి లోనయ్యారు. “నేను మ్యాట్‌పై ఓడిపోలేదు. ఒకవైపు పూర్తి వ్యవస్థ ఉంది. మరోవైపు నేను ఒంటరిగా ఉన్నాను. ప్రతి పాయింట్ కోసం నేను పోరాడాల్సి వచ్చింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, తాను నిరాశపడనని, త్వరలోనే మరింత బలంగా మ్యాట్‌పైకి తిరిగి వస్తానని (“మై వాపస్ ఆవూంగీ”) ఆమె స్పష్టం చేశారు.

More Stories
కాక్రోచ్ జనతా పార్టీతో ఆందోళన అనవసరం… ఆర్ఎస్ఎస్
కరాచీలో దావూద్ ఇంటి నుంచి నడిపిస్తున్న ఉగ్రకుట్ర ఢిల్లీలో భగ్నం!
మమతా మేనల్లుడు అభిషేక్ పై రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లతో దాడి