ట్రంప్ కూతురు ఇవాంకాను చంపేందుకు కుట్ర.. ఇరాక్ ఉగ్రవాది అరెస్టు

ట్రంప్ కూతురు ఇవాంకాను చంపేందుకు కుట్ర.. ఇరాక్ ఉగ్రవాది అరెస్టు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్, ఇరాక్ కలిసి పన్నిన కుట్ర బయటపడింది. ఈ ఘటనలో ఇవాంకాను చంపేందుకు ప్రయత్నించిన తీవ్రవాదిని అమెరికా దళాలు అరెస్టు చేశాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఇరాన్‌లోని సైనిక సంస్థ ఐఆర్‌‌జీసీ (ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ కార్ప్స్) ఒక ఇరాక్ వ్యక్తికి శిక్షణ ఇచ్చింది.

ఇవాంకా ట్రంప్‌ను చంపాలని లక్ష్యంగా ఎంచుకుంది. 2020లో అప్పటి ఇరాన్ కమాండర్ క్వాసెమ్ సోలేమనిని చంపినందుకు ప్రతిగా ట్రంప్ కూతురు ఇవాంకాను చంపేందుకు ఒక ఉగ్రవాదికి శిక్షణ ఇచ్చింది. అతడి పేరు మొహమ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్ సాది (35). మొహమ్మద్‌ను టర్కీలో ఈ నెల 15న అరెస్టు చేశారు. అనంతరం అతడిని అమెరికాకు అప్పగించారు. 

ఈ సందర్భంగా అతడిని విచారించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడు మొహమ్మద్ బాకర్ ఐఆర్‌‌జీసీ కమాండర్ సొలేమనిని గురువుగా భావించేవాడు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అతడు మరణించాడు. దీంతో సొలేమనిని చంపినందుకు బదులు తీర్చుకోవాలని మొహమ్మద్ బాకర్ భావించాడు.  

తన గురువు మరణానికి ప్రతీకారం తప్పదని బహిరంగంగానే ప్రకటించిన మహమ్మద్ ‘మీ రాజసౌధాలు, సీక్రెట్ సర్వీస్ ఏవీ మిమ్మల్ని రక్షించలేవు’ అని ఇవాంకా ఫ్యామిలీని హెచ్చరిస్తూ అరబిక్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘‘మేము ప్రస్తుతం నిఘా, విశ్లేషణ దశలో ఉన్నాం.. నేను మీకు చెప్పాను కదా, మా ప్రతీకారం తీర్చుకోవడం కేవలం సమయం మాత్రమే పడుతుంది’’

దీనికి ట్రంప్ కూతురును చంపాలనుకున్నాడు. ఇక, అతడిని అమెరికా అధికారులు ప్రశ్నించగా ఫ్లోరిడాలోని ఇవాంకా ఇంటికి సంబంధించిన బ్లూప్రింట్ లభించింది. గతంలో తన సోషల్ మీడియాలో కూడా మొహమ్మద్ బాకర్ ఈ బ్లూప్రింట్‌ వివరాల్ని షేర్ చేశాడు. ట్రంప్ ఇంటిని పేల్చేయాలని కూడా అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

ఇరాన్- ఇరాక్ ఉగ్రవాద నెట్‌వర్క్‌లో అతడు కీలక పాత్రధారని అమెరికా అధికారులు తెలిపారు. వాషింగ్టన్‌లోని ఇరాక్ రాయబార కార్యాలయంలో మాజీ డిప్యూటీ ఎంటిఫాద్ ఖాన్బార్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఖాసిమ్ హత్య తర్వాత అల్-సాదీ ప్రజల వద్దకు వెళ్లి ‘‘ట్రంప్ మన ఇంటిని ఎలా తగలబెట్టాడో, అలాగే మనం కూడా ఆయన ఇంటిని తగలబెట్టడానికి ఇవాంకాను చంపాలి’’ అని చెప్పేవాడు’’ అని పేర్కొన్నారు.