బంగ్లాదేశ్‌లోని భారత మిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారి అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. ప్రోటోకాల్ అధికారి అయిన 38 ఏళ్ల నరేన్ ధర్ మృతదేహాన్ని మంగళవారం ఉదయం చిట్టగాంగ్‌లోని భారత సహాయ హైకమిషన్‌లో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం చిట్టగాంగ్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) ఆసుపత్రికిి తరలించారు. ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
‘‘ధర్ భారత సహాయ హైకమిషన్‌లో ప్రోటోకాల్ అధికారిగా పనిచేస్తున్నారు. ఈ విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్ట్‌మార్టం కోసం సీఎంసీ ఆసుపత్రి మార్చురీకి పంపారు’’ అని చిట్టిగాంగ్ ఏసీపీ అమీనూర్ రషీద్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే, మూసివేసిన కార్యాలయంలో ఆయన మృతదేహం లభ్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. చిట్టగాంగ్ (నార్త్ జోన్) డిప్యూటీ కమిషనర్ అమీరుల్ ఇస్లామ్ మీడియాతో మాట్లాడుతూ అసహజ మరణం కింద కేసు నమోదుచేసినట్టు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని భారత అసిస్టెంట్ హైకమిషన్ అధికారులకు అప్పగించినట్టు వెల్లడించారు.
‘‘రాత్రి వేళ ఆ అధికారి బాత్రూమ్‌కు వెళ్తుండగా మరణించి ఉంటారని మేము ప్రాథమికంగా అనుమానిస్తున్నాం” అని ఆయన తెలిపారు. విదేశీయుడు కావడంతో, పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని చిట్టగాంగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మార్చురీకి పంపే ముందు పోలీసులు అవసరమైన లాంఛనాలను పూర్తి చేశారని ఆ అధికారి తెలిపారు. ఢాకాలోని ప్రధాన భారతీయ హైకమిషన్‌తో పాటు, బంగ్లాదేశ్‌లో భారతదేశానికి చిట్టగాంగ్ (చట్టోగ్రామ్), ఖుల్నా, రాజ్‌షాహి, సిల్హెట్ లలో నాలుగు సహాయ హైకమిషన్లు ఉన్నాయి
More Stories
23 ఏళ్లకే యూకే మేయర్‌గా భారత సంతతి యువకుడు
ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్- నార్వే నిబద్ధత!
ట్రంప్ పోస్ట్ లో అమెరికా జెండా ఉన్న గల్ఫ్ పటం, పేలుడు చిత్రాలు