ముఖ్యంగా ఢిల్లీలోని చాలా మంది నకిలీ న్యాయవాదులు ఉన్నట్లు తాను అనుమానపడుతున్నానని పేర్కొంటూ న్యాయవాదుల డిగ్రీలను సీబీఐ ధృవీకరించాలని తాను కోరుకుంటున్నట్లు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఓ పిటీషన్ విచారణ సందర్భంగా సంచలన వాఖ్యలు చేశారు. ‘వారికి తమ ఓట్లు అవసరం’ కాబట్టి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై చర్యలు తీసుకోదని అసహనం వ్యక్తం చేశారు.
“వారిలో వేలమంది నల్లటి గౌన్లు ధరించిన మోసగాళ్లే. వారి డిగ్రీల ప్రామాణికతపై నాకు తీవ్రమైన సందేహాలు ఉన్నాయి. దీనిపై కేవలం సిబిఐ మాత్రమే ఏదైనా చర్య తీసుకోవాలి. బిసిఐ మాత్రం ఎప్పటికీ చర్య తీసుకోదు, ఎందుకంటే వారు కుమ్మక్కయ్యారు,” అని సిజెఐ వ్యాఖ్యానించారు. ఢిల్లీ హైకోర్టు తనను సీనియర్ న్యాయవాదిగా నియమించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ఒక న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్ర అసహనానికి గురైనట్లు కనిపించారు.
హైకోర్టు అతడిని నియమించినప్పటికీ, సుప్రీంకోర్టు దానిని రద్దు చేస్తుందని, ఎందుకంటే ఆ హోదాకు “అతను అర్హుడు కాదని”, ఆ హోదాను న్యాయవాదులకు ప్రదానం చేస్తారని కానీ వారు దానిని కోరుకోరని స్పష్టంగా చిరాకుపడిన సీజేఐ పేర్కొన్నారు. ఆయన చివరికి మెత్తపడి, ఆ న్యాయవాది క్షమాపణ చెప్పి పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి అనుమతించే ముందు, ఆ ఉత్తర్వును స్వయంగా చెప్పి రాయించారు కూడా.
“మీరు ఫేస్బుక్లో ఎలాంటి భాష వాడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోనివ్వండి. ఈ వృత్తిలో క్రమశిక్షణ అంటే ఏమిటో నేను మీకు చూపిస్తాను,” అని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. “సీనియర్ న్యాయవాది అనే హోదా అనేది కేవలం అలంకారప్రాయంగా ఉంచుకోవడానికి ఒక హోదా చిహ్నమా? లేక న్యాయవ్యవస్థలో మీ భాగస్వామ్యం కోసమా?” అని సీజేఐతో పాటు ధర్మాసనంలో ఉన్న జస్టిస్ జయమల్య బాగ్చి ప్రశ్నించారు.
“సమాజంలో ఇప్పటికే పరాన్నజీవులు ఉన్నారు. అలాంటి వారితో మీరు చేతులు కలపాలనుకుంటున్నారా? ఈ వృత్తిలో ఉపాధి దొరకని బొద్దింకల వంటి యువకులు చాలా మంది ఉన్నారు. కొందరు సోషల్ మీడియాలో ఉంటారు, కొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారతారు. హైకోర్టు ఏదో ఒక విషయాన్ని చేపట్టడం లేదని మీరంతా ధిక్కార పిటిషన్లు దాఖలు చేస్తారు. ఇదంతా చెత్త!” అని సీజేఐ పేర్కొన్నారు.

More Stories
అమెరికన్లను నమ్మలేం.. శాంతి కోసం భారత్ కీలక పాత్ర పోషించాలి
నీట్ లీకేజీ సూత్రధారి కులకర్ణి పుణేలో అరెస్ట్
`ఆర్జీకర్’ విచారణలో నిర్లక్ష్యం .. ముగ్గురు ఐపీఎస్ల సస్పెండ్