సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కు పెంపు 

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కు పెంపు 
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు – 2026ను పార్లమెంట్ లో పెట్టే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) కాకుండా ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య 34 –37 (కొత్తగా నలుగురు న్యాయమూర్తులు ) పెంచడానికి వీలుకలుగుతుంది. 
 
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతమున్న 33 నుండి 37కు (భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి) 4 పెంచేందుకు, 1956 నాటి సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) చట్టాన్ని సవరించేందుకు, 2026 నాటి సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రతిపాదనకు నేడు ఆమోదం తెలిపింది,” అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 
 
న్యాయమూర్తుల సంఖ్య పెరగడం వల్ల సుప్రీంకోర్టు మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా పనిచేయడానికి వీలవుతుందని, తద్వారా వేగవంతమైన న్యాయం అందుతుందని ఆ ప్రకటనలో ఇంకా పేర్కొంది. “న్యాయమూర్తుల, సహాయక సిబ్బంది జీతాలు, ఇతర సౌకర్యాల కోసం అయ్యే ఖర్చును భారత సంఘటిత నిధి నుండి భరిస్తాము,” అని ప్రభుత్వం తెలిపింది.
 
సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) 1960 చట్ట ప్రకారం జడ్జిల గరిష్ట సంఖ్యను 10గా నిర్ణయించారు.  అనంతరం 1960 చట్ట సవరణతో జడ్జీల సంఖ్యను 13కి, 1977 సవరణతో 17కి పెంచారు. సిజెఐను మినహాయించి.. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను కేంద్ర కేబినెట్ 1979 చివరల్లో 15 మందికి పరిమితం చేసింది. ఆ తర్వాత సిజెఐ అభ్యర్థన మేరకు ఈ పరిమితిని తొలగించారు. 
 
1986 సవరణతో జడ్జిల సంఖ్యను 17 నుంచి 25కు పెంచారు. 2008లో చేసిన చట్ట సవరణతో 25 నుంచి 30, చివరగా 2019లో సవరణతో 33కు పెంచారు. కేబినెట్‌ ‌తాజా నిర్ణయంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కు పెరగనుంది.