ఇరాన్ రవాణాకు పాక్ ద్వారా ఆరు ప్రత్యేక భూమార్గాలు!

ఇరాన్ రవాణాకు పాక్ ద్వారా ఆరు ప్రత్యేక భూమార్గాలు!
 
 * చర్చలకు మధ్యవర్తిగా ఉంటూనే అమెరికాకు వెన్నుపోటు?
 
ఒకపక్క హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం ద్వారా ఇరాన్‌పై ఒత్తిడి తేవాలని అమెరికా భావిస్తుంటే అమెరికా–ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్  ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడానికి డొనాల్డ్ ట్రంప్ విధించిన హార్మూజ్ జలసంధి నౌకాదళ దిగ్బంధాన్ని నీరుగార్చేలా సంచలన నిర్ణయం తీసుకుంది.   పర్షియన్ గల్ఫ్‌లో

 కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాలు మూసివేయటం, హోర్ముజ్ జలసంధిలో దిగ్బంధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌కు చేరాల్సిన వస్తువుల కోసం పాకిస్తాన్ ఆరు నిర్దేశిత భూమార్గాలను అందుబాటులోకి తెచ్చింది.
పాకిస్తాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ అత్యవసర చర్యను నోటిఫై చేసింది. “ట్రాన్సిట్ ఆఫ్ గూడ్స్ త్రూ టెరిటరీ ఆఫ్ పాకిస్తాన్ ఆర్డర్ 2026” ద్వారా ఒక చట్టబద్ధమైన నియంత్రణ ఉత్తర్వును జారీ చేసింది. ఇది నిలిచిపోయిన సరుకుల రవాణా కోసం తమ భూభాగం గుండా ఒక రహదారి కారిడార్‌ను అధికారికం చేసింది. పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి, ఇరాన్‌కు బయలుదేరిన 3,000కు పైగా కంటైనర్లు కరాచీ, గ్వాదర్ ఓడరేవుల వద్ద నిలిచిపోయాయి.
ఇప్పుడు పాక్ తెరిచిన ఆరు భూమార్గాల ద్వారా 3,000 కార్గో కంటైనర్లను నేరుగా ఇరాన్‌కు చేరవేయవచ్చు. తద్వారా ఇరాన్ తన ఆర్థిక అవసరాలను తీర్చుకుంటూ యుద్ధాన్ని సుదీర్ఘకాలం కొనసాగించే అవకాశం లభించింది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాను మిత్రద్రోహం చేయడమేనని అమెరికా రక్షణ నిపుణులు డెరెక్ జె గ్రాస్‌మాన్ వెల్లడించడం కలకలం రేపుతోంది.  హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో పాటు,  కానీ, ఈ విషయంలో ఇరాన్‌కు పాకిస్తాన్ సాయం చేస్తుందని,  ఇరాన్ వాణిజ్యం చేసుకునేలా తమ దేశం నుంచి ఆరు ప్రత్యేక భూ మార్గాల్ని పాకిస్తాన్ ప్రతిపాదించిందని తెలిపారు.
హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా, అమెరికా దళాలకు దొరక్కుండా ఈ రూట్లో ఇరాన్ వాణిజ్యం చేయొచ్చు.  ఈ మార్గాల ద్వారా రష్యా, చైనా సహా ఇతర దేశాలకు ఇరాన్ చమురు, ఇతర ఉత్పత్తులు ఎగుమతి, దిగుమతులు చేసేందుకు పాకిస్తాన్ సహకరిస్తోంది. అమెరికా జాతీయ భద్రతా నిపుణుడు డెరెక్ జె. గ్రాస్‌మ్యాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. “ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ జాగ్రత్త. మీ మిత్రదేశం పాకిస్థాన్ ఇరాన్‌కు ఆరు భూమార్గాలను తెరిచింది. ఇది మీ దిగ్బంధాన్ని నీరుగార్చి, ఇరాన్ తన ప్రతిఘటనను కొనసాగించేలా చేస్తోంది. పాకిస్థాన్ మరోసారి అమెరికాను దగా చేసింది” అని ఎక్స్ వేదికగా హెచ్చరించారు.

పాకిస్థాన్ వ్యవహార శైలిపై అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్థాన్ ఒక నమ్మదగిన దేశం కాదని, మధ్యవర్తిగా ఉండే అర్హత దానికి లేదని ఇజ్రాయెల్ రాయబారి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇరాన్ కూడా పాక్ తటస్థతను ప్రశ్నిస్తోంది. పాకిస్థాన్ ఎప్పుడూ అమెరికా ప్రయోజనాలకే మొగ్గు చూపుతుందని, అది సరైన మధ్యవర్తి కాదని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కమిషన్ ప్రతినిధి ఎబ్రహీం రెజాయ్ వ్యాఖ్యానించారు. కానీ రెజాయి చేసిన కామెంట్లు తప్పని నిరూపిస్తూనే.. పాక్ ఇరాన్‌కు సాయం చేసింది.