యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ) ఒపెక్, ఒపెక్ ప్లస్ దేశాల కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు యూఏఈ నిర్ణయం పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హర్మూజ్ మూసివేతతో చమురు ఎగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒపెక్ దేశాలకు, యూఏఈ రూపంలో మరో షాక్ తగిలింనట్లయింది.
ఉత్పత్తిపై ఒపెక్ ఆంక్షలు విధించడం, పొరుగు దేశమైన సౌదీ అరేబియాతో విభేదాలు భగ్గుమనడమే ఈ ఆకస్మిక నిర్ణయానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. అయితే, ఒపెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని తెలిపింది. మార్కెట్ డిమాండ్, పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచుతామని అని యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది.
దేశీయ ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తామని వెల్లడించింది. చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు ఇది అతిపెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్)లో చాలా ఏళ్లుగా యూఏఈ సభ్యదేశంగా ఉంది.
ఒపెక్ ఏర్పాటైన ఏడేళ్ల తర్వాత 1967లో ఒపెక్‌లో చేరింది యూఏఈ. సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న యూఏఈ, ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. దేశ ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా, ప్రాంతీయ మిత్ర దేశాలు సరైన విధంగా స్పందించకపోవడంపై యూఏఈ ఇప్పటికే అసంతృప్తితో ఉంది.
“దీర్ఘకాలిక వ్యూహాత్మక, ఆర్థిక దృక్పథాన్ని, అలాగే దేశీయ ఇంధన ఉత్పత్తిలో వేగవంతమైన పెట్టుబడులతో సహా అభివృద్ధి చెందుతున్న ఇంధన స్వరూపం ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా, ప్రపంచ ఇంధన మార్కెట్లలో బాధ్యతాయుత, విశ్వసనీయతో ముందుచూపు గల పాత్ర పోషించాలనే నిబద్ధతను ఇది బలపరుస్తుంది” అని యూఏఈ తెలిపింది.
ఒపెక్ గ్రూపులో చమురు ఉత్పత్తి చేసే 12 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఒపెక్ + రూపులో 22–23 దేశాలున్నాయి. ఇందులో ఒపెక్‌లోని చమురు ఉత్పత్తి చేసే దేశాలతోపాటు రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి.

More Stories
హర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు
యావత్ ప్రపంచానికి ప్రధాన ముప్పుగా ఉగ్రవాదం
ఇజ్రాయిల్‌తో ప్రత్యక్ష చర్చలకు తిరస్కరించిన హెజ్జుల్లా