గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన అజారుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఎట్టకేలకు ఆమోదించడంతో వారిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సోమవారం వారిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్, కోదండరాంలతో తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా ప్రమాణ స్వీకారం చేయించారు.
దీంతో గత కొన్ని రోజులుగా అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా పోతుందా అనే ఉత్కంఠకు తెరపడింది. మండలిలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు.
ప్రమాణస్వీకారం అనంతర మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన పార్టీ, రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్సీగా తనను ప్రతిపాదించిన మంత్రిమండలి, పీసీసీకి, రాహుల్‌గాంధీ, ఖర్గే, సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తెలంగాణలో మైనార్టీల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని వెల్లడించారు.
కాగా, తనకు మంత్రి పదవిపై ఆశ లేదని ఎమ్మెల్సీ కోదండరాం చెబుతూ పదవులు అనేవి శాశ్వతం కాదని స్పష్టం చేశారు. ఒకాయన తాను పోరాడాతానా లేదా అని అన్నారన, తాను పోరాడి చూపిస్తానని చెప్పుకొచ్చారు. గతంలో తనపై అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయిన తన పని ఆగలేదని, కొనసాగుతోందని స్పష్టం చేశారు.

More Stories
తెలంగాణలో స్వీయగణన నమోదుకు అవకాశం
మావోయిస్టు అగ్రనేత గణపతి త్వరగా లొంగిపోవాలి
ఎమ్యెల్సీగా అజారుద్దీన్, కోదండరామ్.. గవర్నర్ ఆమోదం