హరీష్ రావు హస్తిన పర్యటనపై రాజకీయ దుమారం!

హరీష్ రావు హస్తిన పర్యటనపై రాజకీయ దుమారం!
బిఆర్‌ఎస్ ఎమ్మె ల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు హస్తిన పర్యటనకు వెళ్ళడం రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని బిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం హరీశ్‌కు ఇష్టంలేకే బిజెపి నేతలతో కలిసి రహస్యంగా హస్తినకు వెళ్ళారని ఇరువురు మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడి చేశారు. ఈ ప్రకటనలు ప్రకంపనలు సృష్టించాయి. 

అయితే ఈ ఆరోపణలను, అ నుమానాల వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ అధినాయక త్వం తోసిపుచ్చింది. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం మేరకు హరీశ్‌రా వు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినో ద్ కుమార్ ఢిల్లీ వెళ్ళారని పార్టీ అధినాయకత్వం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ వెలువరించనున్న తీర్పు పై చర్చించేందుకు త్రిసభ్య కమిటీలో భాగంగా హరీశ్‌రావు వెళ్ళారని పార్టీ స్పష్టం చేసింది. 

రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడు తూ హరీశ్‌రావు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు ఢిల్లీలో ఏ పార్టీని సంప్రదిస్తున్నారన్న విషయాలు బయటకు రావాలని కోరారు. బిఆర్‌ఎస్ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.   మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ఇష్టం లేకనే ఆయన పార్టీలో చేరే బహిరంగసభకు హాజరు కాకుండా ఢిల్లీ వీడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు .
బిఆర్‌ఎస్‌లో ముసలం మొదలైందని, జీవన్ రెడ్డిని చేర్చుకోవడం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.  జీవన్ రెడ్డిని హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించలేదని,. కెటిఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు హరీష్ రావు వెళ్ళలేదని ఆయన గుర్తుచేశారు. రెండవ సారి జగిత్యాలకు వెళ్లినప్పుడు కెటిఆర్ హరీష్ రావును బ్రతిమిలాడి జీవన్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్ళారని ఆయన చెప్పారు.  పైగా, కెసిఆర్ నివాసానికి జీవన్ రెడ్డి వచ్చినప్పుడు హరీష్ రావు వెళ్ళలేదని చెప్పారు.
ఇదిలాఉండగా హరీష్ రావుతో వెళ్ళిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు, ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో మాట్లాడేందుకు వచ్చామని స్పష్టం చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ నుంచి తప్పించుకునేందుకే మాజీ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీకి పరుగెత్తారని,  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. సిబిఐ విచారణ ప్రారంభం కాకముం దే బిఆర్‌ఎస్ నాయకులు న్యాయవాదులను కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు