హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు రావడం విశేషం. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా రామ్ జగదీష్ (‘కోర్ట్’) ఎంపికయ్యారు. తమిళంలో దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడిగా, సిమ్రాన్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. కన్నడలో ‘కాంతార : చాప్టర్ 1’కి ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడు (రిషబ్ శెట్టి), నటి (రుక్మిణి వసంత్), దర్శకుడు (రిషబ్ శెట్టి)కి అవార్డులు లభించడం విశేషం.
తమిళ రంగం నుండి ఉత్తమ చిత్రంగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఎంపికైంది. అందులో నటించిన సిమ్రాన్ ఉత్తమ నటిగా, ‘కాంత’లో నటించిన దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడిగా, దర్శకుడు మారి సెల్వరాజ్ (బైసన్) బెస్ట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. మలయాళంలో ‘లోకా: చాప్టర్ 1’ ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, ఉత్తమ నటిగా ఆ సినిమా కథానాయిక కళ్యాణీ ప్రియదర్శన్, ఉత్తమ దర్శకుడిగా డొమినిక్ అరుణ్ ఎంపికయ్యారు.
హిందీలో రణవీర్ సింగ్ ఉత్తమ నటుడిగా, యామీ గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇక హిందీలో ఉత్తమ చిత్రంగా ‘ఛావా’, ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్ (ధురంధర్), ఉత్తమ నటిగా యామీ గౌతమ్ ధర్ (హక్), ఉత్తమ దర్శకుడిగా ఆదిత్య ధర్ (ధురంధర్)లను ఎంపిక చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 16న ముంబైలో జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్టులుగా వ్యవహరించనున్నారు. సీనియర్ నటి రేఖ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

More Stories
కాంగ్రెస్ ది దగా ప్రభుత్వం.. రైతుల ఆక్రందనలు వినబడట్లేదా?
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యంపై నిరసన
కాజీపేట రైల్వే యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్ల తయారీ