తమిళనాడులోని అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతి పౌర్ణమికీ గిరి ప్రదక్షిణ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. నూతనంగా నిర్మించిన శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా శుక్రవారం ప్రారంభిస్తూ మొత్తం 22 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం మార్గం ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి భక్తుడికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం లభించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని 22 ప్రధాన దేవాలయాలకు రూ.40 కోట్లతో రహదారి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏలూరు జిల్లాలోని ఐ.ఎస్. జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఘాట్ రహదారి నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.
అలాగే కోటప్పకొండ, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించినట్లు చెప్పారు. దేవాదాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. భక్తులకు సౌకర్యాలు పెంపొందించడం ద్వారానే ఆధ్యాత్మిక క్షేత్రాల ప్రతిష్ట పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆలయాల్లో పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే అపచారాలు జరగవని ఆయన స్పష్టం చేశారు.
త ప్రభుత్వ హయాంలో తిరుమలలోనే ఎన్నో అపచారాలు జరిగాయని పేర్కొంటూ నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పులు జరిగేవి కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆలయ పాలక మండళ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల విశ్వాసం కాపాడటం పాలక మండళ్ల ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

More Stories
బెంగాల్లో రెండు విడతలు, నాలుగు చోట్ల ఒకే దశలో పోలింగ్
బడ్జెట్ లో విద్యకు 15% నిధులు కేటాయించాలి
ఎస్ఐఆర్ బీజేపీ కొత్తగా తెచ్చిన పథకం కాదు