యజమానులు డా. అనిల్ మిశ్రా, ఇతర యజమానులు తమ అర్ధాంగినులతో కలిసి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఆచార్య చంద్రభాన్ శర్మ, ఉపాచార్య రవీంద్ర పైఠణే, యజ్ఞ బ్రహ్మ, ఆచార్య పంకజ్ శర్మ పూజలను నిర్వహించారు. పూజా నిర్వహణ ప్రధాన ఆచార్య ఇంద్రదేవ్ మిశ్రా, ఆచార్య పంకజ్ కౌశిక్ పర్యవేక్షణలో సమస్త అనుష్ఠానాలు శుభంగా పూర్తయ్యాయి.
ఆలయ నిర్మాణ ద్వజం భూమి నుండి దాదాపు 190 అడుగుల ఎత్తులో ఉండేవిధంగా ఏర్పాటు చేస్తున్నారు. 25న జరిగే ధ్వజారోహణకు గవర్నర్ ఆనంది పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ల సమక్షంలో ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ నేతృత్వం వహిస్తారు. ఈ ఆలయం లోపల దర్శన కార్యక్రమంలో దాదాపు 6,000 మంది ఆహ్వానిత అతిథులు పాల్గొంటారు. ఆ రోజు రామ జన్మభూమికి ప్రజా ప్రవేశం మూసివేస్తున్నారు. హాజరైన వారి కోసం, 1,600 గదులు రిజర్వ్ చేశారు.

More Stories
భారత్కు రానున్న ఎస్ 400 గగనతల వ్యవస్థలు
పంజాబ్లో రైల్వే ట్రాక్ పేల్చివేత.. పేలుడుతో నిందితుడు మృతి
కలిసి బిడ్డను కని.. ఇప్పుడు అత్యాచారం అంటే ఎలా?