ఆ ఘటనలో 67 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. ఆ సమయంలో మార్కెట్లు పండుగ కొనుగోళ్లతో కిటకిటలాడుతుండటంతో ప్రాణ నష్టం విపరీతంగా జరిగింది. ఈ దాడిని లష్కర్-ఇ-తయిబా ఉగ్రవాద సంస్థ చేసినట్లు తరువాత దర్యాప్తులో తేలింది. 2008 సెప్టెంబర్ 13న ఢిల్లీ మరోసారి బాంబు దాడుల తాలూకు భయానక దృశ్యాన్ని చూసింది. సాయంత్రం 6.27 గంటలకు పోలీసులకు ఓ ఇమెయిల్ వచ్చింది.
ఆ మెయిల్‌లో పేలుళ్లు జరగబోతున్నాయని హెచ్చరిక ఇచ్చినప్పటికీ, అధికారులు స్పందించేలోపు నగరమంతా కుదిపేసేలా తొమ్మిది వరుస పేలుళ్లు జరిగాయి. కనాట్ ప్లేస్, గ్రేటర్ కైలాష్, గోకుల్‌పురి, బరఖంబా రోడ్ వంటి రద్దీ ప్రాంతాలు ఆ దాడికి వేదికయ్యాయి. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. దిల్లీ వాసుల హృదయాల్లో భయం మళ్లీ ముసురుకుంది. ఆ దాడికి ఇండియన్ ముజాహిద్దీన్ బాధ్యత వహించినట్లు ప్రకటించింది.
ఇక నేడు ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన ఆ భయానక జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసింది. ఈసారి కూడా సాయంత్రం వేళలోనే భారీ శబ్దంతో పేలుడు సంభవించడం ఆ రెండు ఘటనల సమయాన్నే తలపించింది. గత రెండు దశాబ్దాలుగా దిల్లీ నగరం ఉగ్రవాదుల లక్ష్యంగా మారడం దేశ భద్రతా వ్యవస్థలకు పెద్ద సవాలుగా నిలుస్తోంది.
- 1996, మే 25: లజ్‌పత్ నగర్ సెంట్రల్ మార్కెట్‌లో బాంబు పేలుడు. 16 మంది పౌరులు మృతి
- 1997 అక్టోబర్‌లో:ఆయా ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. నవంబర్‌లో ఎర్రకోటకు సమీపంలో మరో ముగ్గురు మృతి చెందారు. పంజాబీ బాగ్ పేలుడు ఘటనలో . నలుగురు మృతి చెందారు.
- 2000 జూన్ 18: ఎర్రకోటకు సమీపంలో పేలుళ్లు. ఇద్దరు మృతి.
- 2005 మే 22: లిబర్టీ, సత్యం సినిమా హాల్స్‌లో రెండు పేలుళ్లు. ఒకరు మృతి,
- 2005 అక్టోబర్ 29: సరోజిని నగర్, పహార్‌గంజ్, గోవింద్‌పురిలలో మూడు బాంబు పేలుళ్లు. 62 మంది మృతి.
- 100మందికిపైగా గాయాలు
- 2006 ఏప్రిల్ 14: జామా మసీద్ ఆవరణలో రెండుచోట్ల పేలుళ్లు. 14 మందికి గాయాలు
- 2008 సెప్టెంబర్ 13: కరోల్‌బాగ్ వరుసగా ఐదు బాంబు పేలుళ్లు. 30మంది మృతి. 90 మందికిపైగా గాయాలు.
- 2008 సెప్టెంబర్ 27: మెహ్రౌలీ పూల మార్కెట్‌లో పేలుడు. ముగ్గురు మృతి, 23 మందికి గాయాలు.

More Stories
సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతం
దేశంలో కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
కుట్రపూరితంగానే రైళ్లలో అగ్ని ప్రమాదాలు