సంఘటనా స్థలానికి రెస్క్యూ, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని మోహరించాయి. రద్దీ సమయంలో ఈ ఘటన జరగడంతో భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో న్యాయవాదులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు చాలా తీవ్రంగా ఉండటంతో ఆ శబ్దం దాదాపు ఆరు కిలోమీటర్ల పరిధి వరకూ వినిపించినట్లు స్థానిక మీడియా నివేదించింది. గాయపడిన వారిలో ఎక్కువ మంది లాయర్లు, కోర్టు సిబ్బందిగా పేర్కొంది.
కాగా, దక్షిణ వజీరిస్థాన్ లోని కాడెట్ కాలేజ్ వానా వద్ద తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ దాడిని పాక్ భద్రతా దళాలు భగ్నం చేశాయి. కళాశాల విద్యార్థులను బందీలుగా చేసుకోవాలన్న టీటీపీ ప్రయత్నాన్ని పాక్ బలగాలు అడ్డుకున్నాయి. టీటీపీ ప్రయత్నాన్ని అడ్డుకున్న కొన్ని గంటల్లోనే ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలో బ్లాస్ట్ జరగడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Stories
పీఓకె పౌరులపై పాక్ “క్రూరమైన బలప్రయోగం”పై భారత్ ఆగ్రహం
హమాస్ నిరాయుధీకరణ, గాజా నుండి ఇజ్రాయిల్ బలగాల ఉపసంహరణ!
అమెరికాలో చదివి ఉద్యోగం చేయాలంటే రూ.95 లక్షల ఫీజు?