
ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సి డి సి) సంస్థలు జరిపిన సమగ్ర అధ్యయనంలో టీకా కారణంగా మరణాలు సంభవించలేదని తేలింది. ఈ అధ్యయనం 2023 మే నుంచి ఆగస్ట్ వరకు 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 47 ప్రాంతీయ ఆసుపత్రుల సహాయంతో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారిసై అధ్యయనం జరిపారు. ఇందులో 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య అకస్మాత్తుగా సంభవించిన మరణాలను విశ్లేషించారు.
ఈ అధ్యయనంలో హార్ట్ ఎటాక్ కేసుల పెరుగుదలకు జన్యుపరమైన మార్పులు ప్రధాన కారణంగా గుర్తించారు. ప్రస్తుతం ఎయిమ్స్, ఐసీఎంఆర్ నిధులతో పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టింది. నివేదిక పూర్తి అయిన తర్వాత ఎయిమ్స్ కూడా ఐసీఎంఆర్ నిధులతో మరో పూర్తిస్థాయి అధ్యయనాన్ని చేపట్టింది. ఆకస్మిక మరణాలకు కరోనా టీకా కాకుండా జీవనశైలి, మునుపటి ఆరోగ్య సమస్యలు, కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత ఏర్పడిన సమస్యలు, జెనెటిక్ కారణాలు వంటి అనేక అంశాలు కారణమని వివరించారు.
కరోనా టీకా మానవాళిని మహమ్మారి నుంచి రక్షించిందని, అనవసరమైన ఆరోపణలు ప్రజల్లో భయాన్ని, టీకాపై నమ్మకాన్ని దెబ్బతీయవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. హాసన్ జిల్లాలో గత నెలలో 20 మందికిపైగా అకస్మాత్తుగా మరణించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కానీ, ఈ ఘటనలకు సంబంధించి తగిన పరిశోధనలు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది.
More Stories
కోయంబత్తూరు పేలుళ్ల నిందితుడు 29 ఏళ్ళకు అరెస్ట్
యువతలో పెరుగుతున్న అక్యూట్ మైలోయిడ్ లుకేమియా
గుజరాత్లో వంతెన కూలి 10 మంది మృతి