
2024లో బాలలపై హింస తీవ్ర స్థాయికి చేరుకుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో బాలలపై హింస తీవ్రంగా పెరిగిందని, సుమారు మూడు దశాబ్దాల క్రితం ఐరాస పర్యవేక్షణ ప్రారంభించినప్పటి నుండి ఇవే అత్యంత దారుణమైన గణాంకాలని ఆ సంస్థ వెల్లడించింది. ‘బాలలు, సాయుధ సంఘర్షణ’ పేరుతో యుఎన్ సెక్రటరీ జనరల్ ఈ వార్షిక నివేదికను విడుదల చేశారు. 2023తో పోలిస్తే 25శాతం పెరుగుదల ఉందని పేర్కొన్నారు.
41,370 తీవ్ర ఉల్లంఘనల ఘటనలు చోటుచేసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. వాటిలో 2024లోనే అత్యధికంగా 36,221 ఘటనలు జరిగాయని, అంతకు ముందు 5,149 ఘటనలు జరిగినట్లు తెలిపింది. 30 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇవి అత్యధికమని పేర్కొంది. ఇవి కొత్త గరిష్ట స్థాయి 2023 సంవత్సరాన్ని అధిగమించాయని తెలిపింది. 2023 కూడా రికార్డు స్థాయిలో హింసాత్మ ఘటనలు నమోదయ్యాయని, ఇది కూడా మునుపటి ఏడాది కంటే 21 శాతం పెరుగుదలను సూచించిందని నివేదిక తెలిపింది.
అత్యధికంగా 2024లో 4,500మందికి పైగా మరణించగా, 7,000 మందికి పైగా గాయపడగా, బాలలను నిరంతర శత్రుత్వం, విచక్షణారహిత దాడుల భారాన్ని భరిస్తూనే ఉన్నారని నివేదిక పేర్కొంది. బహుళ హక్కుల ఉల్లంఘనలకు గురైన బాలల సంఖ్య కూడా గణనీయంగా పెరిగి 22,495కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 20 సంఘర్షణ ప్రాంతాల్లో 18 ఏళ్లలోపు బాలల హక్కుల ఉల్లంఘనలు జరిగాయని తెలిపింది.
ఇజ్రాయిల్ దాడులతో పాలస్తీనా భూభాగాలు 8,500 కంటే ఎక్కువ తీవ్రమైన ఉల్లంఘణలతో దారుణమైన ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించాయి. వీటిలో గాజా స్ట్రిప్‌లో 4,800 కంటే అధికంగా ఉన్నాయి. ఈ నివేదిక మొదటి భాగంలో నిలిచింది. గాజాలో 8,500 కంటే తీవ్రమైన ఉల్లంఘనలు జరిగాయి. గాజాలో 1,259 మంది చిన్నారులు మరణించారని నివేదిక నిర్థారించింది.
2024లో యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతంలో మరణించిన మరో 4,470 మంది బాలల సమాచారాన్ని సేకరించే ప్రక్రియ చేపట్టినట్లు యుఎన్ పేర్కొంది. గతేడాది లెబనాన్‌లో 500 మందికి పైగా బాలలు మరణించారని తెలిపింది. ఇవి కూడా ఇజ్రాయిల్ సైనిక దాడుల ఫలితమేనని నివేదిక హైలెట్ చేసింది.
More Stories
కోయంబత్తూరు పేలుళ్ల నిందితుడు 29 ఏళ్ళకు అరెస్ట్
యువతలో పెరుగుతున్న అక్యూట్ మైలోయిడ్ లుకేమియా
గుజరాత్లో వంతెన కూలి 10 మంది మృతి