
“మీ శాఖలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా క్యాబినెట్ లో పెట్టండి” అని కెసిఆర్ చెప్పే వారని, ఇది నిజం కాదంటే తాను దేనికైనా సిద్ధమని ఈటెల సవాల్ విసిరారు. ప్రాజెక్టు నిర్మించడం, అవినీతి వేరువేరుగా చూడాలని, ప్రాజెక్ట్ నిర్మించాలి కానీ వాటిని అడ్డం పెట్టుకుని సంపాదించడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల కోసం సాగిందని పేర్కొంటూ తాను జైళ్లకు పోయిన, రక్తం చిందించి పెట్రోల్ మంటల్లో యువత కాలిపోయింది. ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్ట్ కట్టాలా వద్దా? అని ప్రశ్నించారు. అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే మొదలు పెట్టారు కానీ పూర్తిచేయలేదని, జలయజ్ఞంలో ప్రాణహిత చేవెళ్ల 5 ఏళ్లలో పూర్తి చేసే ప్రాజెక్ట్ కదా? ఎందుకు చేయలేదని నిలదీశారు.
కమిషన్ త్వరగా పూర్తి చేసి అవినీతి నిగ్గు తేల్చాలని కోరుతూ బీజేపీ అయితే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుందని చెప్పారు. బిజెపి ప్రాజెక్టులు కట్టడానికి వ్యతిరేకం కాదని, అధికారం అడ్డం పెట్టుకుని టెండర్ లేకుండా పనులు పంచుకోవడం తప్పని, ఎటిఎంగా మార్చుకున్న కల్చర్ ను తప్పు పడుతున్నామని రాజేందర్ స్పష్టం చేశారు.
దమ్ముంటే రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవాలని, కుంగి పిల్లర్లు రిపేరు చేసి నీళ్లు ఇవ్వాలని, అవినీతి చేసిన వారిని వదలపెట్టవద్దని రేవంత్ రెడ్డికి హితవు చెప్పారు. బనకచర్లలో కూడా తనను బదనాం చేయాలని చూస్తున్నారని చెబుతూ పోతిరెడ్డిపాడు పేరుతో అన్యాయంగా మన నీళ్లను తీసుకుని పోతుంటే దుర్మార్గం అని చెప్పి పులిబిడ్డలా కొట్లాడింది తానేనని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డితో కొట్లాడి జెండాకు ఎక్కింది నేను…అవి ఎక్కడికీ పోవు..ఇప్పుడు బదనం చేయాలని చూస్తే ప్రజలు నమ్మరని ఈటెల హెచ్చరించారు.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్