
పూర్తి స్థాయిలో సింధూనదీలోని తన వాటా జలాల వినియోగానికి భారత్ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. జమ్మూకశ్మీర్ గుండా పాక్కు పోతున్న మిగులు జలాలను 113 కిమీ పొడవైన కాలువ ద్వారా పంజాబ్, హరియాణా, రాజస్థాన్లకు మళ్లించాలని యోచిస్తోంది. కాలువ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై కేంద్రం లోతుగా అధ్యయనం చేస్తోందని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.
పాక్కు సింధూజలాలను నిలిపివేస్తున్నట్టు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సింధూ నదీజలాల మళ్లింపు ప్రణాళికను మోదీ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నదని ఆ కథనం పేర్కొంది. సింధూ పరివాహకంలోని చినాబ్ను రావి-బియాస్-సట్లేజ్తో ఈ కాలువ అనుసంధానిస్తుందని శనివారం బీజేపీ శిక్షణా శిబిరంలో కేంద్ర హోం మంత్రి అమిత్షా సూచనప్రాయంగా వెల్లడించారు.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా