
జమాతే-ఇ-ఇస్లామీ సమాజానికి ముప్పు కలిగించే గ్రూపు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హెచ్చరించారు. నిలంబూర్‌లోని వళికడవులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ “ప్రజాస్వామ్య సమాజం పట్ల ప్రేమ లేని, నేటి పద్ధతులకు అనుగుణంగా లేని వారిని దేశం, సమాజం అంగీకరించదు. జమాతే-ఇ-ఇస్లామీ అటువంటి సంస్థ” అని విమర్శించారు.
ముస్లిం సమాజంలోని అన్ని ముఖ్యమైన వర్గాలు తిరస్కరిస్తున్న జమాతే-ఇ-ఇస్లామీతో నాలుగు ఓట్లకొసం యుడిఎఫ్ ఇప్పుడు చేతులు కలపడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఇలా ఉండగా, కాంతపురం ఎ పి అబూబకర్ ముసలియార్ నేతృత్వంలోని సున్నీలు జమాతే-ఇ-ఇస్లామీని, దాని వ్యవస్థాపకుడు సయ్యద్ అబుల్ అలా మౌదుడి ప్రతిపాదించిన దైవ పరిపాలన (హక్కిమియా) ఆలోచనను తిరస్కరించినందున ఆ సంస్థను రద్దు చేసి ముస్లిం ప్రధాన స్రవంతిలో భాగం కావాలని కోరారు.
రిసాలా వారపత్రిక తాజా సంచికలోని సంపాదకీయం, జమాతే-ఇ-ఇస్లామీ సైద్ధాంతికంగా, సంస్థాగతంగా తన ఔచిత్యాన్ని కోల్పోయిందని స్పష్టం చేసింది. “సాంప్రదాయ ముస్లిం సంస్థల నుండి జమాతేను వేరు చేసింది అది ప్రతిపాదించిన హక్కిమియా ఆలోచన” అని సంపాదకీయం పేర్కొంది. జమాతే దైవభక్తి లేనిదిగా భావించిన ప్రజాస్వామ్య వ్యవస్థను అంగీకరించినందున భారతీయ ముస్లింలు ఇస్లాంకు దూరంగా ఉన్నారనే ప్రమాదకరమైన స్థితికి మౌదుది చేరుకున్నారని పేర్కొంది.
“ఇస్లాం కాకుండా వేరే ఏదైనా వ్యవస్థను అంగీకరిస్తే ఒక వ్యక్తి తన ఇస్లాంను కోల్పోతాడనేది జమాతే వాదన ముఖ్యాంశం” అని సంపాదకీయం పేర్కొంది, సాంప్రదాయ ఇస్లాంతో అన్ని సంబంధాలను తెంచుకున్న తర్వాత జమాతే ఏర్పడిందని తెలిపింది. “కానీ ఇప్పుడు, జమాత్ నాయకత్వం హక్కిమియా సిద్ధాంతాన్ని అనుసరించడం లేదని, మౌదుడి చెప్పిన అన్ని విషయాలతో వారు ఏకీభవించడం లేదని చెబుతున్నారు” అని అది పేర్కొంది.
More Stories
భారత్కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు.. 2027 నాటికి బుల్లెట్ రైలు