
అయినప్పటికీ చమురు మార్కెట్ కంపెనీల (ఇఎంసి) ఆదాయంపై ప్రభావితమవుతున్నది. అదే సమయంలో అప్‌స్ట్రీమ్ కంపెనీల ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నది. అప్‌స్ట్రీమ్ కంపెనీలు చమురు, గ్యాస్ పరిశ్రమ ప్రారంభ భాగంలో పని చేస్తుంటాయి. భూమి నుంచి చమురు, గ్యాస్‌ను వెలికితీసే ప్రక్రియ. ఇది గ్యాస్ కంపెనీలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి.
ఎల్‌ఎన్‌జీ ముడి చమురుకు సంబంధించింది. ముడి చమురు ధర పెరిగితే ఎల్‌ఎన్‌జీ ధర సైతం పెరుగుతుంది. చమురు ధరల్లో ఈ పెరుగుదల ఇప్పటికీ 2025 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పెరుగుదల కంటే తక్కువగా ఉందని పేర్కొంది. ప్రస్తుత పెరుగుదల గత నాలుగు సంవత్సరాల సగటు కంటే చాలా తక్కువగా ఉన్నది. ప్రస్తుతం, బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు దాదాపు 75 డాలర్లుగా ఉన్నది.
ఇది 2026 ఆర్థిక సంవత్సరానికి విశ్లేషకుల అంచనా 68 డాలర్ల కంటే కంటే దాదాపు 6-7 డాలర్లు ఎక్కువ. అయినప్పటికీ, ముడి చమురు ధరలు 2022-25 సగటు కంటే 9డాలర్లు తక్కువగా.. 25 ఆర్థిక సంవత్సరం సగటు కంటే 4డాలర్లు తక్కువగా ఉన్నది. డిమాండ్ లేకపోవడం మార్కెట్‌ను ఆధిపత్యం చేస్తుంది.
అయితే, ఇంధన కంపెనీ స్టాక్స్ హెచ్చుతగ్గులను చూస్తున్నాయి. ఇది ప్రపంచ అనిశ్చితుల మధ్య మార్కెట్ ఆందోళనలను ప్రతిబింబిస్తున్నది. దీని వెనుక కారణం హార్ముజ్ జలసంధిలో తీవ్రమవుతున్న సంక్షోభం కారణం. హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఎందుకంటే ఇది పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్‌ను కలుపుతుంది.
ప్రపంచంలోని చమురు రవాణాలో ఎక్కువ భాగం ఈ మార్గం గుండా వెళుతుంది. భారతదేశం చమురు దిగుమతుల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ, ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో సగానికిపైగా హార్ముజ్ జలసంధి గుండా వెళతాయి. ఈ మార్గంలో ఏదైనా ఆటంకాలు ఎదురైతే.. భారతదేశం ఇతర వనరులు, మార్గాల కోసం వెతకాల్సిన అవసరం ఏర్పడుతుంది.
More Stories
ఎల్ఐసీలో 1 శాతం వాటా విక్రయం
ఆగస్టు నుంచి అన్ని పోస్టాఫీసుల్లో డిజిటల్ చెల్లింపులు
29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు