
*ఇరాన్‌ను హెచ్చరించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
మిస్సైల్స్‌ను ప్రయోగించకపోవడం ఆకపకపోతే టెహ్రాన్ మంటల్లో కాలిపోతుందంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. రక్షణ మంత్రి శనివారం ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడిఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇయాల్ జమీర్, మోసాద్ డైరెక్టర్ డేవిడ్ బర్నియా, ఇతర ఉన్నత సైనిక అధికారులతో ప్రస్తుత పరిస్థితులపై సమావేశం నిర్వహించారు. ఇజ్రాయెల్ పౌరులకు ఇరాన్ హాని కలిగిస్తే దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
అయతుల్లా అలీ ఖమేని ఇజ్రాయెల్ దేశీయ సరిహద్దుపై మిస్సైల్స్ దాడి చేస్తూనే ఉంటే టెహ్రాన్ కాలిపోతుందని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ దాడులకు సమాధానంగా ఇరాన్ సైతం ప్రతీకారం తీర్చుకుంది. పెద్ద సంఖ్యలో మిస్సైల్స్‌ను ప్రయోగించింది. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ అణు, సైనిక స్థావరాలకే పరిమితం చేయడంతో పాటు వాటితో సంబంధం ఉన్న కీలక అధికారులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ వస్తున్నది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా ఇజ్రాయెల్ ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేయాల్సి వచ్చింది. తదుపరి నోటీసు వచ్చే వరకు విమానాశ్రయం మూసే ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇరాన్ శుక్రవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్‌పై దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, చాలా క్షిపణులను అడ్డుకున్నామని ఐడీఎఫ్ పేర్కొంది.
తక్కువ సంఖ్యలో క్షిపణులు ఎయిర్ డిఫెన్స్‌లోకి చొచ్చుకు వచ్చాయని, దాంతో ప్రాణనష్టం వాటిల్లిందని సైన్యం పేర్కొంది. క్షిపణులు పడిపోయిన ప్రదేశాలలో టెల్ అవీవ్, రామత్ గాన్, సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని రిషోన్ లెజియాన్ నివాస ప్రాంతాలు ఉన్నాయని సైన్యం పేర్కొంది. ఇరాన్ క్షిపణి దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు మరణించారని, మరో 70 మంది గాయపడ్డారని సమాచారం సమాచారం.
అయితే, వైమానిక స్థావరాలు సహా తమ అన్ని స్థావరాలు సాధారణంగా పనిచేస్తున్నాయని, ఎలాంటి వాటిల్లలేదని ఐడీఎఫ్ పేర్కొంది. శుక్రవారం ప్రయోగించిన వంద డ్రోన్‌లతో పాటు, రాత్రిపూట ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించిన అనేక డ్రోన్‌లను వైమానిక దళం నేవీ కూల్చివేసినట్లు సైన్యం వివరించింది.
More Stories
భారత్ ను మినహాయించి 22 దేశాలపై ట్రంప్ సుంకాలను
అమెరికా చదువుల పట్ల భారతీయ విద్యార్థుల్లో అనాసక్తి
ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం