దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 7వేలు దాటింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని కలిసే మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని పీఎంఓ సూచించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ప్రధానిని ఆయన నివాసంలో కలుసుకున్న ప్రతినిధుల బృందం ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.
మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రధానిని కలవాలన్నా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రధానిని కలిసేముందు కరోనా పరీక్షా చేయించుకున్నట్లు తెలుస్తున్నది. అలాగే ప్రధాని మోదీని కలుసుకోబోయే పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను బీజేపీ నిర్వహిస్తున్నది. ప్రధాని బహిరంగ కార్యక్రమాలలో, సభలలో పాల్గొనే సమయంలో ఆయన చుట్టూ ఉండే అధికారులు అందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
గత 24 గంటల్లో 117 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7,154కి ఎగబాకింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 2,165 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్‌లో 1,281 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 747, ఢిల్లీలో 731, మహారాష్ట్రలో 615 కేసులు, కర్ణాటకలో 467, ఉత్తరప్రదేశ్‌లో 231, ఉత్తరప్రదేశ్‌లో 227 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
గత 24 గంటల్లో మూడు మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో ఇద్దరు, మధ్యప్రదేశ్‌లో ఒకరు మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 77కి ఎగబాకింది. ఇక ఇప్పటి వరకూ 9,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు.కేరళలో అత్యధికంగా యాక్టివ్ కేసులుండగా, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానంలో ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. కరో నా కొత్త వేరియంట్‌పై భయాందోళనలు అవసరం లేదని, ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
డేటా బోర్డు లో వెల్లడించిన సమాచారం ప్రకారం బుధవారానికి దేశంలో మొత్తం 7121 కేసులు ఉండగా, కేరళలో అత్యధికంగా 2223 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ 1223, ఢిల్లీ 757, పశ్చిమ బెంగాల్ 747, మహారాష్ట్ర 615, కర్ణాటక 459, ఉత్తరప్రదేశ్ 229, తమిళనాడు 204, రాజస్థాన్ 138, హర్యానా 125, ఎపి 72, మధ్యప్రదేశ్ 65, మహారాష్ట్ర 615, ఛత్తీస్‌గఢ్ 48, బీహార్ 47, ఒడిశా 41, సిక్కిం, పంజాబ్‌లలో 33 కేసులు, తెలంగాణ 11, పుదుచ్చేరి, ఝార్ఖండ్ ల్లో చెరో 10 కేసులు, జమ్ముకశ్మీర్ 9, అ స్సాం, గోవాల్లో 6, చండీగఢ్ , ఉత్తరాఖండ్ 3, హిమాచల్ ప్రదేశ్ 2, మణిపుర, త్రిపుర చెరో కేసు నమోదయ్యాయి.
గుజరాత్‌లో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల్లో 200 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో కలవరం సృష్టిస్తోంది. గుజరాత్‌లో ఇప్పటివరకు 1281 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్‌లో కరోనా కేసులు 7 వేలు దాటాయి. చాపకింద నీరులా దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తోంది. ప్రజలు మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
More Stories
భారత్‌కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!