బురఖాతో 70 శాతం ముస్లిం మహిళల్లో విటమిన్ డి కొరత 

బురఖాతో 70 శాతం ముస్లిం మహిళల్లో విటమిన్ డి కొరత 
ముస్లిం మహిళలు ఎక్కువ సమయం బురఖా ధరించడం వల్ల సూర్యరశ్మిని శరీరాన్ని కాకపోవడం వల్ల విటమిన్‌-డీ స్థాయి తగ్గుతుందని పరిశోధనలో తేలింది. హిందూ మహిళల్లో ఈ సమస్య 70 శాతం తక్కువగా ఉందని వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం గ్రామాల్లో నివసించే చాలా మంది హిందూ మహిళలు పొలాల్లో పనిచేస్తుండడం వల్ల తగినంత సూర్యరశ్మి శరీరంపై పడడమే. 
జౌన్‌పూర్‌లోని ఉమానాథ్‌ సింగ్‌ అటానమస్‌ మెడికల్‌ కాలేజీ ఆర్థోపెడిక్స్‌ విభాగం చేసిన పరిశోధనలో 70శాతం మంది ముస్లింలు విటామిన్‌-డీ లోపంతో బాధపడుతున్నారని, మరో 30శాతం మంది హిందూ మహిళలు వెన్నునొప్పి, వివిధ ఎముకల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఎముకల సాంద్రత తగ్గడం వల్ల పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని, మహిళలు సైతం ఈ విషయాన్ని గ్రహించరని, కొన్ని సందర్భాల్లో ఎముకలు స్వయంచాలకంగా విరిగిపోతాయని హెచ్చరించారు.

మెడికల్ కాలేజీ ఆర్థోపెడిక్స్ విభాగం సీనియర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమేశ్‌ కుమార్ సరోజ్ మార్గదర్శకత్వంలో ఈ పరిశోధన 100 మంది హిందూ, 100 మంది ముస్లిం మహిళలపై నిర్వహించారు. పరిశోధన డేటా ప్రకారం పది నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు గల 60 మందిపైగా ముస్లిం బాలికలు ఫ్యాక్చర్‌ సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల దాదాపు 35 మంది మహిళలు ఎముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు.

చాలా మంది మహిళలు ఆకస్మిక ఎముక పగుళ్ల సమస్యతో బాధపడుతున్నారని, వైద్య పరిభాషలో దీన్ని ఆస్టియోమలేసియాగా పిలుస్తారని డేటా తెలిపింది. శరీరంలో విటమిన్ డీ పరిమాణం బాగా తగ్గిన సమయంలోనే ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. డాక్టర్ సరోజ్ బృందం నిర్వహించిన ఈ అధ్యయనంలో ఆస్టియోమలేసియా రోగులకు సాధారణంగా వెన్నునొప్పి, కండరాల ఉద్రిక్తత, తిమ్మిర్లు, చిరాకు వంటి సమస్యలు ఉంటాయని గుర్తించారు. 

ఎముకలు బలహీనపడతాయి. చాలామంది సాధారణ ఆరోగ్య సమస్యలుగా భావిస్తారని, నొప్పుల నివారణకు మందులు లేదంటే మల్టీ విటమిన్లు వంటి మందులను మాత్రమే తీసుకుంటారని డేటా పేర్కొంది. ఎక్స్-రే, విటమిన్-డీ ప్రత్యేక పరీక్షలు చేసినప్పుడు అసలు వ్యాధి గుర్తించలేరని పేర్కొన్నారు.

సమస్య నుంచి బయటపడేందుకు ఉదయం, సాయంత్రం తేలికపాటి సూర్యకాంతిలో వ్యాయామం చేయడం, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, పాలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. అయితే, శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోకూడదని చెబుతున్నారు. వాస్తవానికి శరీరంలో విటమిన్ డీ స్థాయి మిల్లీలీటర్‌కు 30 నుంచి 100 నానోగ్రాములు ఉండాలి. జౌన్‌పూర్‌లోని చాలా మంది మహిళల్లో, ఈ స్థాయి 20 కంటే తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

ఇది చాలా తీవ్రమైన పరిస్థితని, ముస్లిం మహిళలు తీవ్రమైన ఎముకల సంబంధిత వ్యాధులతో ఎక్కువగా ప్రభావితమవుతున్నారని డేటా పేర్కొంది. 70 శాతం కంటే ఎక్కువ మంది ముస్లిం మహిళలు ఆస్టియోమలేసియా అనే వ్యాధితో బాధపడుతున్నారని పరిశోధనలో తేలింది. హిందూ మహిళల్లో ఈ సమస్య తక్కువగా ఉందని, ముస్లిం మహిళలు ఈ వ్యాధి బారినపడుతున్నారని ప్రొఫెసర్ డాక్టర్ సరోజ్ తెలిపారు.