
బీఆర్ఎస్‌లో నాలుగు స్తంభాలాట నడుస్తోందని, మాజీ మంత్రి హరీష్ రావ్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ చీలిక దిశగా అడుగులు వేస్తోందని, పదిమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే బీఆర్‌ఎస్ఎల్పీ చీలిపోతుందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. తండ్రీ, కొడుకు, కూతురు, అల్లుడు మధ్య విబేధాలు ఉన్నాయని పేర్కొంటూ రజితోత్సవ సభలో కేటీఆర్‌దే పెత్తనమని, కవిత, హరీష్ రావులకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని తెలిపారు.
కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లగానే బీఆర్ఎస్‌లో చీలిక రాబోతోందంటూ సంచలన వాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా లేదా మొదటి వారంలో చీలిక వస్తుందని పేర్కొంటూ చీలిక కోసం తెరవెనుక జరగాల్సిన తంతు రేవంత్ రెడ్డి సహకారంతో హరీష్ రావు, కవితలు చేస్తున్నట్లు సమాచారం ఉందనివెల్లడించ రు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్‌లో ఉంటే తమకు ఎదిగే అవకాశం ఉండదని హరీష్, కవితలు ఈ వ్యూహానికి తెరతీశారంటూ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్‌ను చీల్చడం రేవంత్ రెడ్డితో కాలేదని, అందుకే హరీష్‌ను అడ్డం పెట్టుకొని తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి నేత ఆరోపించారు. వివిధ కారణాలతో కేసీఆర్ క్రియాశీలకంగా ఉండటం లేదని, సభలో కూడా అంత క్రియాశీలకంగా లేరని, తన తరువాతి బీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్ అని పరోక్షంగా ఇండికేషన్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
డీఫాల్ట్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ కొనసాగుతున్నారని, కేసీఆర్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, దానితో కవిత, హరీష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతూ కవిత ఒంటరి అయ్యిందని, ఆదిపత్య పోరు తారాస్థాయికి చేరిందని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. కవిత తీసుకున్న తెలంగాణ తల్లి మార్పు, పూలే విగ్రహం ఏర్పాటుకు పార్టీ నుంచి మద్దతు రాలేదని, మహిళా సమానత , సామాజిక తెలంగాణ సాధన అంశంలో బీఆర్ఎస్ విఫలమైందన్న వ్యాఖ్యలు వ్యూహాత్మకమే ఆయన స్పష్టం చేశారు.
పదవులు, ఆస్తులు అన్నీ కేటీఆర్ కేనా అంటూ లేఖాస్త్రంలో కవిత తిరుగుబాటు చేశారని బీజేపీ నేత గుర్తు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనపై కవిత విమర్శలు చేస్తున్నారని, కేసీఆర్‌కు రాసిన లేఖ త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఉద్యమంలో జాగృతి కృషి ఉందని, వాస్తవాలు బయటపెట్టాలని కవిత అనుకుంటున్నట్లు తెలిపారు. కేటీఆర్‌కే అన్ని ఇస్తుండటంతో కవిత తిరుగుబాటు జెండా ఎగురవేశారని ఆయన తెలిపారు.
తనను రాజకీయంగా అణిచి వేసేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. మేడే రోజు తండ్రి పాలనా వైఫల్యాలు ఎండగట్టినట్లు చెప్పారు. తనను రెచ్చగొడితే మరింత రెచ్చిపోతానని చెప్పడం ఆమెలోనే ఆవేదన బయటపడిందని పేర్కొన్నారు.
తనను రాజకీయంగా అణిచి వేసేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. మేడే రోజు తండ్రి పాలనా వైఫల్యాలు ఎండగట్టినట్లు చెప్పారు. తనను రెచ్చగొడితే మరింత రెచ్చిపోతానని చెప్పడం ఆమెలోనే ఆవేదన బయటపడిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్‌లో ఒకే పవర్ సెంటర్ ఉండాలని కేటీఆర్ అభిమతమని, అయితే జగన్, షర్మిల తరహాలోనే కేటీఆర్‌కు కవిత తయారైనట్లు తెలిపారు. సొంత ఎజెండా పెట్టుకుని పని చేయకూడదని కేటీఆర్ చెప్పడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. బీఆర్ఎస్‌పై విమర్శలు చేసిన వెంటనే హరీష్ రావు మీడియా సమావేశం వెనక కేసీఆర్ హస్తం ఉందని చెప్పారు.
More Stories
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుకు రిమాండ్
ఎమర్జెన్సీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి