హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర భగ్నం‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍.. ఇద్ద‌రి అరెస్టు

హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర భగ్నం‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍.. ఇద్ద‌రి అరెస్టు
హైదరాబాద్‌లో భారీ పేలుళ్లను పోలీసులు భగ్నం చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్ నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నారన్న స‌మాచారాని పసిగట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ చేసిన ఆప‌రేష‌న్ విజ‌యం సాధించింది.
 
విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రహ్మాన్ (29), హైదరాబద్‌కు చెందిన సయ్యద్ సమీర్ (28) విజయనగరంలో పేలుడు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో పేలుళ్లకు స్కెచ్ వేశారు. సౌదీ అరేబియా నుంచి ఐసిసి మాడ్యూల్‌ ద్వారా వీరికి ఆదేశాలు వచ్చాయి. దీంతో పోలీసులు ఒక ఇంట్లో తనిఖీలు చేయగా పేలుళ్ల కోసం వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్లు లభించాయి.
పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు దుండగులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రదారి ఎవరు?. అసలు కారణాల ఏంటి, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉగ్రమూలాలు ఉన్నాయని ఇప్పటికే తేలింది.

గతంలోనూ హైదరాబాద్‌లో ఉగ్రవాదులు పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని తెలియడంతో నగర వాసుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఇద్దరేనా, ఇంకెవరైనా ఉన్నారా అనే ఆందోళన కొనసాగుతోంది. దీనిపై ఇంటిలిజెన్స్ ఆరా తీయాల‌ని ప‌లువురు కోరుతున్నారు. అయితే తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం చాలా పటిష్టంగా, అలర్ట్‌గా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దుండగుల విచారణ తర్వాత పూర్తి వివరాలు వివరిస్తామని పోలీసులు తెలిపారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.