అటువంటి సమయంలో ఎప్పటికప్పుడు బీజేపీకి వ్యతిరేఖంగా మాట్లాడే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తరచూ వివాదాస్పద వా ఖ్యలతో వార్తలలో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ స్టార్ నటుడు తాజాగా పాకిస్తాన్ హీరోకి మద్దతుగా నిలవడం వివాదం సృష్టిస్తోంది.
ఇక పాకీస్తాని నటుల సోషల్ మీడియాను బ్లాక్ చేయడం , వారి సినిమాలను బాలీవుడ్ లో రిలీజ్ అవ్వకుండా ఆపేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ పాక్ హీరో సినిమా విడుదలను అడ్డుకోవడంపై స్పందించారు. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబిర్ గులాల్ సినిమాను భారత్ లో నిషేధించడాన్ని ప్రకాష్ రాజ్ తప్పు పట్టారు.
“పోర్నోగ్రఫీని తప్పించి ఏ సినిమాను ఇలా నిషేదించడం నాకు సరిగ్గా అనిపించడం లేదు. ముందు సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులు పాక్ నటుల సినిమాలు చూస్తారా? లేదా? అనేది తెలుస్తుంది. విడుదల చేసి ఆ ఫలితాన్ని వారికే వదిలేస్తే మంచిది” అంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రకాశ్ రాజ్.
ఆయన పాక్ నటులకి మద్దతు ఇవ్వడాన్ని నెటిజన్స్ తీవ్రంగా తప్పు పడుతున్నారు. కాగా, పహల్గాం దాడి తరువాత వారి చర్యను ఖండిస్తూ ప్రకాశ్ రాజ్ సుదీర్ఘమైన నోట్ విడుదల చేశారు. “ఇటువంటి పనులు మా దేశం చేయదు, దేశ పౌరులు అంతకన్నాచేయరు. మా మంచి తనాన్ని చేతగాని తనంగా భావించవద్దు” అంటూ పాకిస్తాన్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

More Stories
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం
సతీశన్ ముఖ్యమంత్రి కావాలంటూ కాంగ్రెస్ శ్రేణులు ప్రదర్శనలు
రెజ్లర్ వినేశ్ పోగట్పై అనర్హత వేటు