మే 1 నుంచి ఒకే రాష్ట్రం ఒక ఆర్‌ఆర్‌బీ విధానం

మే 1 నుంచి ఒకే రాష్ట్రం ఒక ఆర్‌ఆర్‌బీ విధానం
 
ఒకే రాష్ట్రం ఒక ఆర్‌ఆర్‌బీ విధానం ఈ ఏడాది మే 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి టిఫికేషన్‌ విడుదల చేసింది. దాంతో 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ బ్యాంకులను (ఆర్‌ఆర్‌బీ) కన్సాలిడేట్‌ చేయనున్నది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ సహా 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణకు సంబంధించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
ఇది పూర్తయితే ఈ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనున్నది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2004-05 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఆర్‌బీల నిర్మాణాత్మక ఏకీకరణను మొదలుపెట్టింది. ఇందులో ఇప్పటి వరకు మూడు దశల్లో 2020-21 నాటికి ఆర్‌ఆర్‌బీల సంఖ్య 196 నుంచి 43కి తగ్గింది.  ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు చట్టం-1976లోని సెక్షన్ 23A (1) ప్రకారం, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్న ఆర్‌ఆర్‌బీలు ఒకే సంస్థగా మారనున్నాయి.

ఆంధ్రప్రదేలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ విలీనం చేయబడి.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా మారతాయి. కొత్త బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో అమరావతిలో ఉండనుండగా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పాన్సర్‌ చేయనున్నది. 

యూపీలోని బరోడా యూపీ బ్యాంక్‌, ఆర్యవర్ట్ బ్యాంక్, ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంక్ ఉత్తర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో విలీనవుతాయి. ప్రధాన కార్యాలయం బ్యాంక్ ఆఫ్ బరోడా స్పాన్సర్‌షిప్ కింద లక్నోలో ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో, బంగియా గ్రామీణ వికాస్, పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్, ఉత్తరబంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ విలీనం చేయబడి పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్‌గా మారుతాయి.

ఇదే తరహాలో మిగతా ఎనిమిది రాష్ట్రాల్లోనూ ఆర్‌ఆర్‌బీలు విలీనమవుతాయి. ఆర్‌ఆర్‌బీలో కేంద్రానికి 50శాతం వాటా ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు స్పాన్సర్ వాటా 35 శాతం, రాష్ట్రాలకు 15 శాతం ఉంటుంది. సవరించిన చట్టం ప్రకారం వాటాను తగ్గించిన తర్వాత కూడా కేంద్రం, స్పాన్సర్ బ్యాంకుల వాటా 51 శాతం కంటే తక్కువ ఉండకూడదు. 

బ్యాంకులకు రూ.2వేల కోట్ల మూలధనం ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం, అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రూ.2వేల కోట్ల అధీకృత మూలధనం ఉంటుంది. ఇదిలా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, కళాకారులకు రుణాలు, ఇతర బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు ఆర్‌ఆర్‌బీ యాక్ట్‌ కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేశారు. 

ఇందులో కేంద్రానికి 50శాతం, స్పాన్సర్‌ బ్యాంకులకు 30శాతం, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 శాతం వాటా ఉంటుంది. ప్రస్తుతం 26 రాష్ట్రంలో 43 ఆర్‌ఆర్‌బీలు ఉండగా.. ఈ సంఖ్య 28 తగ్గుతుంది.