
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపోరేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 6.25 నుంచి 6 శాతానికి రెపోరేటు తగ్గించి పడేసింది. ఆర్‌బీఐ వరుసగా రెండోసారి రెపోరేటు తగ్గించటం విశేషం. ఆర్‌బీఐ నిర్ణయంతో గృహ, పర్సనల్, వాహనాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి.
వడ్డీ రేట్లు తగ్గించటంపై ఆర్‌బీఐ గవర్నర్ బుధవారం మాట్లాడుతూ “రెపో రేటు తగ్గిస్తూ మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం రెపో రేటును తగ్గించటం ఇది రెండో సారి. ప్రపంచ స్థాయిలో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలపై ఆర్‌బీఐ ఓ కన్నేసి ఉంచింది. దిగుమతుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై అత్యధిక స్థాయిలో టారిఫ్ విధించారు. ఆ టారిఫ్‌ల కారణంగా ఎగుమతులపై ప్రభావం పడుతుంది” అని తెలిపారు.
ఏప్రిల్ 4 నాటికి భారత్‌లో విదేశీ మారక నిల్వలు 676 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ నిల్వలు రాబోయే 11 నెలల దిగుమతులను నిర్వహించడానికి సరిపోతాయని సంజయ్ మల్హోత్రా తెలిపారు.
More Stories
కాంగ్రెస్, ఆర్జేడీలకు కుటుంబ రాజకీయాలే ముఖ్యం
భారత్ `విశ్వగురువు’గా మారడమే ప్రపంచ శాంతికి మార్గం
మంత్రివర్గం అనుమతి లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా