
మరోవైపు బెట్టింగ్ ప్రమోషన్స్‌లో మనీ ల్యాండరింగ్ జరిగిందనే కోణంలో ఈ కేసులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంటరైంది. ఈడీ ఎంటర్ అవ్వడంతో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన నిందితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అరెస్టు భయంతో కొందరు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న మిగతా వారిపైనా పోలీసులు మరింత నిఘా పెంచారు.
హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తులో వేగం పెంచారు. నిందితులకు ఒక్కొక్కరిగా నోటీసులు ఇస్తూ విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే విష్ణు ప్రియ, టేస్టీ తేజాకు నోటీసులు అందజేయగా వారిలో నిన్న (మంగళవారం) పోలీసుల ఎదుట టేస్టీ తేజ హాజరయ్యారు. విచారణ సందర్భంగా టేస్టీ తేజా, బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. ప్రమోషన్‍లో భాగంగా ఎలాంటి నజరానా పొందాడనే వివరాలను రాబట్టారు. కాగా, బుధవారం మరికొంతమందికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మరో ఆరుగురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు ఇచ్చారు. వీరిని గురువారం నాడు విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, కేసు నమోదైన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి ఇప్పటికే దుబాయ్‌కి పరారయ్యారు. అయితే పోలీసులు మాత్రం నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. అలాగే హీరో, హీరోయిన్లతోపాటు మరికొంతమంది ఇన్‌ఫ్ల్యూఎన్సర్లపైనా నిఘా పెంచారు.
More Stories
హెచ్సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్