ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యంత సంపన్నులు

ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యంత సంపన్నులు
 
* అత్యంత సంపన్నులలో డీకే శివకుమార్, చంద్రబాబు, జగన్, వెంకటస్వామి
 
ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యంత సంపన్నులు. ఏపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ. 65 కోట్లు. ఇది దేశంలోనే అత్యధికం. పార్టీ పరంగా చూస్తే దేశ వ్యాప్తంగా బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులకు ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి. బీజేపీకి చెందిన ముంబై, ఘట్కోపర్‌ తూర్పు ఎమ్మెల్యేగా పరాగ్‌ షా రూ.3,400 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. 
 
దేశంలోని టాప్‌-10 సంపన్న ఎమ్మెల్యేల్లో నలుగురు టీడీపీకి చెందినవారే. తెలంగాణ ఎమ్మెల్యే జీ వివేకానంద (చెన్నూరు) 11 వ స్థానంలో ఉండగా, కే రాజగోపాల్‌ రెడ్డి (మునుగోడు) 15, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (పాలేరు) 19వ స్థానంలో ఉన్నారు.  అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ తర్వాత మరో అత్యంత ధనికుడైన కర్ణాటక, కనకపుర ఎమ్మెల్యే, ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్. ఆయన ఆస్తివిలువ రూ.1,413 కోట్లు పైనే.

ఎమ్మెల్యేలు తాజా ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లలో వివరాలనే ఏడిఆర్ ఈ నివేదికలో పేర్కొంది. 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 4,092 మంది ఎమ్మెల్యేల ఆస్తులను అధ్యయనం చేసి ఈ నివేదిక విడుదల చేశారు.అత్యంత పేద ఎమ్మెల్యే పశ్చిమ బెంగాల్ లోని ఇందూస్ కు చెందిన బిజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధార అయన ప్రకటించిన ఆస్తి రూ. 1700 మాత్రమే.

అత్యంత ధనికులైన ఎమ్మెల్యేలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండడం విశేషం. చంద్రబాబు నాయుడు ఆస్తి రూ. 931 కోట్లు కాగా, జగన్ మోహన్ రెడ్డి ఆస్తి రూ. 757 కోట్లు. 

మిగతా ప్రముఖులలో కర్ణాటకకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కె హెచ్ పుట్టస్వామి గౌడ. ఆయన ఆస్తిరూ. రూ.1,267 కోట్లు, కర్ణాటకకే చెందన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియకృష్ణ. వారి ఆస్తి రూ. 1,156 కోట్లు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే పి. నారాయణ ఆస్తి రూ. 824 కోట్లు. ఏపీ కే చెందిన టిడీపీ ఎమ్మెల్యే వి ప్రశాంతి రెడ్డి ఆస్తి రూ. 716 కోట్లు ఉన్నారు.

అత్యంత ధనికులైన పది మంది ఎమ్మెల్యేలలో నలుగురు, అగ్రస్థానంలో ఉన్న 20 మంది ధనిక ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే. వారిలో ఐటీ మంత్రి నారా లోకేశ్, హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉన్నారు.

ఎమ్యెల్యేల అత్యధిక సగటు ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌ లో రూ. 65.07 కోట్లు, కర్ణాటకలో రూ. 63.58 కోట్లు, మహారాష్ట్రలో రూ. 43.44 కోట్లు, తెలంగాణలో రూ. 38 కోట్లు. ఎమ్యెల్యేల అత్యల్ప సగటు ఆస్తులు త్రిపురలో రూ. 1.51 కోట్లు, బెంగాల్‌  లో రూ. 2.80 కోట్లు, కేరళలో రూ.  3.13 కోట్లు.

కర్ణాటకలోని మొత్తం 223 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తి రూ. 14,179 కోట్లు కాగా, మహారాష్ట్రలో మొత్తం 236 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తి రూ. 12,424 కోట్లు. ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 174 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తివిలువ రూ. 11,323 కోట్లు. ఒక ఎమ్మెల్యే ఆస్తి వివరాలు తెలియలేదు.